మారిన కేసీఆర్ వ్యూహం

పార్లమెంటు సమావేశాలు ముగింపుకు వచ్చాయి. ఇప్పుడు పోరాడినా వచ్చే ప్రయోజనం ఏం లేదు. అందుకే పెట్టా బేడా సర్దుకుని ఇంటికొచ్చేయమని చెప్పారు కేసీఆర్. ఆ.. ఇంకేమి పార్లమెంటు. అక్కడ ఏం జరగదు. ఏం చేయరు. రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నా..పట్టించుకునే వారు లేరు. అందుకే అక్కడ నిరసన తెలపడం కంటే ఇంటికి రావడం మంచిది అంటున్నారు. అందుకే చివరి రెండు రోజులు టీఆర్ఎస్ ఎంపీలు సభకు వెళ్లకుండా రాష్ట్రానికి వచ్చే పని చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరమే. టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు లోక్ సభకు హాజరు కారాదని ఆయన నిర్ణయించారు. గత కొన్ని రోజులుగా ముస్లిం రిజర్వేషన్లు, గిరిజన రిజర్వేషన్ల పెంపుపై టిఆర్ఎస్ ఎమ్.పిలు లోక్ సభలో ఆందోళన చేశారు. అయినా కేంద్రం పట్టించుకోవడం లేదు. 
అందుకే వెనక్కు వచ్చేయాలని చెప్పారంటున్నారు. కాసేపు పోరాటం మరికాసేపు బీజేపీకి సహకరించడం వంటి చర్యలతో కేసీఆర్ ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. థర్డ్ ఫ్రంట్ అంటూ హడావుడి చేసిన కేసీఆర్ ను జాతీయ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా జాతీయ రాజకీయాల్లో ఆయన ఒంటరి వాడనే చర్చ సాగుతోంది. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్ కుటుంబ సభ్యుల మధ్య వచ్చిన వివాదాన్ని మళ్లించడానికే ఆయన జాతీయ రాజకీయాలను గుర్తు చేశారంటున్నారు. అసలు కేసీఆర్ జాతీయ రాజకీయాలు అని చెప్పారంటే… ఆయన తెలంగాణ వదిలి పెట్టేది లేదంటున్నారు తెలిసిన వాళ్లు. 
కేసీఆర్ అవును అంటున్నారంటే. దాని వెనుక పెద్ద కథ ఉంటుందంటున్నారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం తప్ప కేసీఆర్ ఏం చేయలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు ఎన్నికైన కొత్త సభ్యులు సంతోష్ కుమార్, లింగయ్య, ప్రకాష్ లు ప్రమాణం చేశారు. ఆ పనిపూర్తి అయిందా.. అయితే ఇక రండి. మీరు ఎక్కువ సమయం అక్కడ ఉండటం వృధా అని సంకేతాలిచ్చారట కేసీఆర్. రెండు రోజులు అక్కడ ఉందామని వినేలా లేరు కేసీఆర్ అంటున్నారు కొత్త సభ్యులు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.