కేసీఆర్‌కు పంచాయ‌తీ స‌వాల్‌!

ప‌థ‌కాల జోరుతో బంగారు తెలంగాణ సాధించామ‌న డాంభికాలు పోతున్న కేసీఆర్ సర్కార్‌కు కొత్త గండం త‌లుపుత‌ట్టింది. పంచాయ‌తీ ఎన్నిక‌ల రూపంలో వ‌చ్చిన స‌మ‌స్య నుంచి గ‌ట్టెక్కేందుకు కేసీఆర్  మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న‌ట్లు విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. అదెలా అంటారా.. సార్వత్రిక ఎన్నిక‌ల‌కు మరో ప‌ది నెల‌లు స‌మ‌యం ఉంది. దీనికి సిద్ధంగా ఉన్నామంటూ గులాబీ నేత‌లు చెబుతున్నా.. ఎక్క‌డో గుబులు మాత్రం వెంటాడుతుంది. నిధులు, నీళ్లు, నియామ‌కాల‌పై ప్ర‌భుత్వం గుప్పించిన ఏ ఒక్క హామీ పూర్తిగా నెరవేర‌లేదు. పైగా.. స‌ర్కారుపై చాప‌కింద‌నీరులా వ్య‌తిరేక‌త పెల్లుబుకుతుంది. మీడియాను క‌ట్ట‌డి చేసినా.. జ‌నం అలోచ‌న‌ల‌కు అడ్డుక‌ట్ట వేయ‌టం సాధ్య‌మ‌య్యేది కాదు. పైగా హ‌స్తం పార్టీ ఓ వైపు బ‌ల‌ప‌డుతుంది. బీజేపీ కూడా దీనికి త‌గిన‌ట్లుగా ఊత‌మిస్తుంది. ఈ మ‌ధ్య‌నే జరిగిన క‌ర్ణాట‌క ఎన్నిక‌లు.. ప్రాంతీయ పార్టీల‌కు కొత్త సందేహాన్ని పెంచాయి. ప్ర‌జ‌లు స్ప‌ష్ట‌మైన తీర్పునిచ్చేందుకు సిద్ధంగా లేర‌నేది కాంగ్రెస్‌, జేడీఎస్‌, బీజేపీ సాధించిన మెజార్టీ ద్వారా తేల్చిచెప్పారు. అదే వాతావ‌ర‌ణం తెలంగాణ‌లో ఎదురైతే.. హ‌స్తం, సైకిల్ రెండూ క‌ల‌సిపోతాయి.. గులాబీ పువ్వు వాడిపోతుంది.. క‌మ‌లం క‌నుమరుగ‌వుతుంది.

 

ఈ లెక్క‌ల‌తోనే. పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌ర‌ప‌మంటూ కోర్టు ఆదేశించినా.. మీన‌మేషాలు లెక్కించ‌టం వెనుక కార‌ణ‌మ‌ని విశ్లేష‌కుల అంచ‌నా. నిజ‌మే.. కేసీఆర్‌, హ‌రీష్‌, కేటీఆర్ ఊహించుకున్నంత‌గా గొర్రెల పంపిణీ, రైతుబంధు ప‌థ‌కాలు చేర‌లేదు. పైగా కుర్రాళ్ల‌కు ఉద్యోగాలివ్వాలి మొర్రో అంటే.. గొర్రెలు కాచుకోవాలా అనే వ్య‌తిరేక‌త కూడా యువ‌త నుంచి పెల్లుబ‌కుతుంది. పైగా కాళేశ్వ‌రం ప్రాజెక్టు త‌ప్ప‌.. ఏవీ కూడా సాగునీటికి అనువుగా త‌యారుకాలేదు. ఉమ్మ‌డి రాష్ట్రంగా హైద‌రాబాద్ సాధించిన ప్ర‌గ‌తి త‌ప్ప‌.. ఇప్ప‌టికీ ప్ర‌త్యేకంగా ఏర్పాటైన సంస్థ ఒక్క‌టీ లేదు. పైగా ఊద‌ర‌గొట్టేప్ర‌చారంతో గులాబీదండు.. గుట్టుగా జేబులు నింపుకుంటుంద‌నే అప‌వాదు.. నిజ‌మ‌నే వ‌ర‌కూ చేరింది. ఇన్నింటి మ‌ధ్య‌.. కేసీఆర్ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు వెళితే.. ఇబ్బందులు త‌ప్ప‌వ‌నేది పార్టీ బాధ‌ట‌. ఒక‌వేళ గెలిస్తే…. అధికార పార్టీ ముద్ర ప‌డుతుంది. ఓడితే.. ప్ర‌జా వ్య‌తిరేక‌త‌కు ఇవిగో సాక్ష్యాలంటూ.. 2019లో ఓట‌మి అంచుకు చేరేందుకు తామే గొయ్యి తీసుకున్న‌ట్ట‌వుతుంది. ఇటువంటి ప‌రిస్థితుల్లో దీన్ని అధిగ‌మించేందుకు ఏవో కొత్త ఎత్తులు వేయాల‌నుకుంటున్నార‌ట‌.. అధికార ప‌క్ష‌నేత‌లు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.