రెడ్లపై గులాబీ బాస్ క‌క్ష సాధిస్తున్నారా!

అదేంటీ అంత‌మాట అంటారా! పైగా మొన్న ప్ర‌క‌టించిన 105 సీట్ల‌లో ఎక్కువ ఇచ్చింది రెడ్డి వ‌ర్గానికే క‌దా! అనుమానం రావ‌చ్చు. మ‌రి.. కాంగ్రెస్  సీనియ‌ర్ నేత జ‌గ్గారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేసిన‌ట్టు. అదేంటీ.. మాన‌వ అక్ర‌మ‌ర‌వాణా చేశాడు. పైగా దేశ‌ద్రోహం. అందులోను భార్య‌పేరిట ఓ మ‌హిళ ఇద్ద‌రు పిల్ల‌లు. అమెరికాలో వ‌దిలేశాడు. అమ్మాడో.. లేక‌పోతే.. ఇంకేమైనా చేశాడో అనేగా మీ స‌మాధానం. నిజ‌మే.. మీరుఊహించిన‌ట్లే అనుకుందాం. కానీ. 2004కు ముందు.. అంటే..  ప‌దిహేనేళ్ల‌ క్రితం.. ఇప్పుడు బుగ్గ‌కార్ల‌లో మందీమార్భ‌లంతో తిరిగే.. దాదాపు పెద్ద‌త‌ల‌కాయ‌ల‌న్నీ ఇదే చేసేవార‌ట‌. అయితే దీన‌వెనుక ఓ విష‌యం దాగుంది. అమెరికాలో స్థిర‌ప‌డిన గుజ‌రాత్, రాజ‌స్తాన్ కుటుంబాల స‌భ్యులు ఇక్క‌డే ఉంటారు. కానీ.. వీరిని అమెరికా తీసుకెళ్ల‌టం చాలా క‌ష్టం అందుకే..ద‌ళారులుగా ఖ‌ద్ద‌రు నేత‌ల‌ను ముఖ్యంగా ఎమ్మెల్యేల‌ను ఎంచుకుంటారు. వారికి త‌ల‌కు ఇంత‌ని చెప్పి పాతిక‌ల‌క్ష‌ల వ‌ర‌కూ ముట్ట‌జెప్పేవార‌ట‌. పైగా అప్ప‌ట్లో ఇంత డ‌బ్బు అంటే.. అబ్బో అనాల్సిందే. ఇలా అడ్డ‌దారిలో పెళ్లాంబిడ్డ‌లంటూ అమెరికా పంపిన వారిలో చాలామందే ఉన్నార‌ట‌. గులాబీగూటిలో పెద్ద‌త‌ల‌కాయ పేరు కూడా వినిపిస్తుంది. ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే.. గులాబీ పార్టీ ముంద‌స్తు మ‌చ్చ‌ట‌తో రంగంలోకి దిగింది.
అయితే.. వాస్త‌వ ప‌రిస్థితులు ఇందుకు భిన్నంగా ఉండ‌టంతో అధికారాన్ని వినియోగించారు. 2014లో న‌మోదైన కేసులు బ‌య‌ట‌కు తీసి జ‌గ్గారెడ్డిని మాన‌వ అక్ర‌మ‌ర‌వాణా కింద లోప‌లేశారు. ఇంత‌టితో ఆగిపోలేదు.. మ‌రో రెడ్డి వ‌ర్గానికి చెందిన నాయ‌కుడికి రేపో.. మాపో బేడీలు వేయ‌బోతున్నారు. ఈ మ‌ద్య‌నే జానారెడ్డి అసెంబ్లీలో చేసిన ప్ర‌క‌ట‌నంటూ త‌ప్పుడు కామెంట్ల‌తో కేసీఆర్ త‌ప్పిదం చేశాడు. ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసేముందుకు ఐదుకోట్ల‌రూపాయ‌లు రెడ్డి వ‌ర్గానికి బ‌హుమ‌తి ప్ర‌క‌టించి.. ఇప్పుడిలా చేయ‌టం వెనుక పెద్ద రాజ‌కీయ‌మే ఉందంటున్నారు నిపుణులు. రెడ్డి వ‌ర్గంపై  కొన్ని వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త ఉంది. పైగా ఇన్నేళ్లుగా వారే అధిక‌స‌మ‌యం ఏలుబ‌డి సాగించారు. కేసీఆర్ సీఎం అయ్యాక రెడ్డి వ‌ర్గానికి ప్రాధాన్య‌త‌నిచ్చారు. అయితేప‌వ‌ర్ దూరం కావ‌టంతో కేసీఆర్ స‌ర్కారును కూల‌దోయాల‌నే ఉద్దేశంతో దాదాపు 20 మంది రెడ్డి వ‌ర్గ ఎమ్మెల్యేలు ఫామ్‌హోస్‌లో స‌మావేశ‌మైన‌ట్లు అప్ప‌ట్లో గుస‌గుస‌లు వినిపించాయి. అనంత‌ర నేప‌థ్యంలోనే రెడ్డి వ‌ర్గానికి చెందిన పోలీసు అధికారుల‌ను దూరంగా ఉంచార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇప్పుడు అదే విమ‌ర్శ‌లు జ‌గ్గారెడ్డి అరెస్టుతో వెల్లువెత్తుతున్నాయి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.