పవన్ కల్యాణ్ అనుచరులతో కత్తి మహేష్ భేటీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కత్తిమహేష్ భేటీ అయ్యారు. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలోని ఓ మీడియా కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా మాట్లాడవద్దని వారు సూచించగా… ఇందుకు కత్తి మహేష్ సానుకూలంగా స్పందించారంటున్నారు. పవన్ కల్యాణ్ ను విమర్శించి వార్తల్లోకి వచ్చాడు కత్తి మహేష్. తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొని అందరికీ తెలిశాడు కత్తి. ఆ తర్వాత పవన్ కల్యాణ్ పై నిరంతరం విమర్శలు చేస్తు కావాల్సినంత ఫాలోయింగ్ తెచ్చుకొన్నాడు. 
తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కత్తి మహేష్ తన సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించాడు. పవన్ కల్యాణ్ లో తాను ఏమి కోరుకుంటున్నానో.. అదే ఇప్పుడు పవన్ లో కనిపిస్తుందన్నారు. ఆయన ఇన్నాళ్లకు లైన్లోకి వచ్చారు. దీంతో ఆయన్ని ప్రశంసించకుండా ఉండలేక పోతున్నాను అని కామెంట్లు పెట్టాడు. వైసీపీ జగన్ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు మేము రెడీ అన్నాడు. మరోవైపు పవన్ మీకు ముందుకొచ్చే దమ్ముందా..? అని  జగన్ కు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. జగన్ పెట్టే అవిశ్వాస తీర్మానానికి ఎంపీల మద్దతు కూడగట్టేందుకు దేశమంతా పర్యటిస్తాను అని పవన్ అన్నాడు. ఇది కత్తి మహేష్ కు బాగా నచ్చిందట. అక్కడ పడిపోయానని చెప్పాడు. 
గతంలో పవన్ కల్యాణ్ అసలు రాజకీయాలకు పనికి రాడని చెప్పిన వాడే ఇప్పుడు రూటు మార్చాడు. పవన్ నిజమైనా నాయకుడు అంటున్నాడు. కాలం మారింది. చర్చలు జరిగాయి. కత్తికి రెండు వైపులా పదును ఉందని తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం వీగిపోయినా.. పార్లమెంట్ లో తెలుగువాడి ఆగ్రహాన్ని తెలిపే అవకాశం వస్తుంది. దేశ వ్యాప్తంగా బీజేపీ కి ఉన్న వ్యతిరేకత బలపడుతుంది. కనీసం అందుకోసమైనా కొన్ని పార్టీలు ఆంద్రప్రదేశ్ ఎంపీలు పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తాయని చెప్పారు కత్తి. ఇదే సరైన సమయం తెలుగు వాడి ఆగ్రహాన్ని ఢిల్లీ వేదికగా తెలియజెప్పడానికి అని కత్తి మహేష్ అంటున్నాడు. ఇంతలో ఎంత మార్పు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.