జ‌న‌సేనుడికి చెక్ పెట్టేందుకు రంగంలోకి క‌త్తిమ‌హేష్‌

బిగ్‌బాస్‌తో ఫేం అయిన సినీ క్రిటిక్ రైట‌ర్ క‌త్తిమ‌హేష్ ఆ త‌రువాత వివాదస్ప‌ద వ్యాఖ్య‌లు, ప‌వ‌న్ అభిమానుల‌తో గొడ‌వ పెట్టుకొని హాట్ టాపిక్‌గా మారాడు. చివ‌ర‌కు అత‌న్ని వ‌దిలించుకునేందుకు న‌గ‌ర పోలీసులు ఆరు నెల‌ల పాటు న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ విధించారు. కొద్ది రోజుల‌పాటు సైలెంట్‌గా ఉన్న క‌త్తి ఇప్పుడు రాజ‌కీయాల‌పై దృష్టిసారించాడ‌ట‌. అయితే ఈసారి మాత్రం సొంతంగా కాకుండా.. ఓ రాజ‌కీయ పార్టీలో చేరి, త‌న ప్ర‌స్థానాన్ని కొన‌సాగించాల‌ని భావిస్తున్నారు. ఇంత‌కీ ఆ పార్టీ ఏద‌ని అనుకుంటున్నారా..? అధికార టీడీపీ మాత్రం కాదు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీనే. ఇది వాస్త‌వానికి కొంత ద‌గ్గ‌ర‌గానే క‌నిపిస్తోంది. ఎంద‌ుకంటే.. గ‌తంలో ఓసారి ప్ర‌త్యేక హోదా కోసం ఢిల్లీలో వైసీపీ ధ‌ర్నాచేసింది. అందులో క‌త్తి మ‌హేశ్ కూడా పాల్గొని త‌న మ‌ద్ద‌తు తెలిపి మాట్లాడారు. ఇక ఇటీవ‌ల జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై వైసీపీ అధినేత జ‌గ‌న్ చేసిన వ్య‌క్తిగ‌త వ్యాఖ్య‌లు పెద్ద దుమార‌మే రేపాయి. ఈ నేప‌థ్యంలో వీరిద్ద‌రి టార్గెట్ ప‌వ‌న్ అనే స్ప‌ష్టంగా తెలుస్తోంది.
ఈ నేప‌థ్యంలోనే క‌త్తి మ‌హేశ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపుణ ఏదో ఒక రిజర్వుడ్ స్థానం నుంచి పోటీ చేస్తార‌నే టాక్ వినిపిస్తోంది. ఇదే విష‌యాన్ని క‌త్తి కూడా మీడియా మిత్రుల‌కు చెబుతున్నార‌ట‌. తాను ఇక విజ‌య‌వాడ‌లోనే ఉంటాన‌నీ.. అక్క‌డి నుంచే త‌న కార్య‌క‌లాపాలు చేప‌డుతాన‌ని అంటున్నాడ‌ట‌. అయితే.. నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి చుట్టుప‌క్క‌ల నియోజ‌క‌వ‌ర్గాల్లోని రిజ‌ర్వుడ్ స్థానం నుంచి బ‌రిలోకి దిగుతార‌నే టాక్ వినిపిస్తోంది. అయితే.. క‌త్తి మ‌హేశ్ వైసీపీలోకి వ‌స్తే.. త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌నే భావ‌న‌లో జ‌గ‌న్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప‌వ‌న్‌ను ఎదుర్కొనే ప‌నిని క‌త్తికి అప్ప‌గించి తాను ఎన్నిక‌ల్ల వ్య‌వ‌హారంలో నిమ‌గ్న‌మ‌వ్వాల‌ని జ‌గ‌న్ భావ‌స్తున్నాడ‌ట‌. కాని జ‌న‌సేనుడిని దెబ్బ‌తీయ‌డం క‌త్తిమ‌హేష్ సాధ్య‌మా చూడాలి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.