పవన్ పై కత్తిగట్టిన కత్తి మహేష్

జనసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. రాం గోపాల్ వర్మ నుంచి కత్తి మహేష్ వరకు ఆయన తీరును తప్పు పడుతున్నారు. తాట తీస్తానని బీరాలు పలికిన పవన్ కల్యాణ్ కేసీఆర్ కోసం గంటన్నర పాటు ప్రగతి భవన్ లో వెయిట్ చేసిన సంగతి తెలిసిందే. నా… కొడుకూ….(బూతులు) అంటూ మరోవైపు కేసీఆర్ అతన్ని తిట్టిన సంగతి తెలియంది కాదు. తెలంగాణలో కేసీఆర్ కు ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునే పని చేస్తోంది కాంగ్రెస్. ఇలాంటి సమయంలో కేసీఆర్ ను పవన్ కలవడం హాట్ టాపికైంది. 
                                  సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ నేతలంతా పవన్ కల్యాణ్ రాజకీయాల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ మీడియా డిబెట్ లో పాల్గొన్న కత్తి మహేష్.. పవన్‌ ఒక రాజకీయ జోకర్, పవర్ బ్రోకర్ అని తిట్టిపోశాడు. ప‌వ‌న్ కు ధైర్యముంటే అన్నీ స్థానాల్లో పోటీ చేయాల‌ని సూచించారు. తాను రాజ‌కీయాల్లో వ‌స్తున్నాన‌ని ప్ర‌కటించిన ర‌జ‌నీకాంత్… త‌మిళ‌నాడు అన్నీ స్థానాల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ర‌జనీ ఎలా ప్ర‌క‌టించారో.. జ‌న‌సేనాని అలాగే ప్ర‌క‌టించాల‌ని స‌వాల్ విసిరారు.
                                     తొలిగా అన్ని సీట్లల్లో పోటీ చేస్తానని చెప్పిన పవన్ గంటల వ్యవధిలోనే ఆ ట్వీట్ ను తొలగించాడు. మిగతా పార్టీల నుంచి వచ్చిన ఒత్తిడి వల్లనా..లేక ఇంకో కారణముందా అనేది తెలియలేదు. కత్తి మహేష్ వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు ఎప్పుడూ మండిప‌డుతూనే ఉన్నారు. ఇప్పుడు అదే పని చేేస్తున్నారు. ప‌వ‌న్ ను విమ‌ర్శించ‌డం మ‌హేష్ ఓ వ్య‌స‌నంలా మారిందని వారు అంటున్నారు. ఫలితంగా ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో కత్తి పై నిప్పులు చెరుగుతూ కామెంట్లు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కు రాజకీయాలు తెలియవని సిపిఐ నేత చాడా వెంకటరెడ్డి అన్నారు. కమ్యూనిస్టులు సామాన్యంగా తొందరపడి మాట్లాడారంటారు. అలాంటి వారే పవన్ పని అయింపోయిందంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.