జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన కత్తి మహేశ్

ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్.. కొద్దిరోజుల కిందట హైదరాబాద్ నుంచి బహిష్కరణకు గురై ఏపీలో ఉంటున్నాడు. తెలుగులో బిగ్‌బాస్ షోకు ముందు ఎవరికీ పెద్దగా పరిచయం లేని ఆయన.. దాని తర్వాత సెలెబ్రిటీ అయిపోయాడు. తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కొద్ది నెలల పాటు ఆయన ఫ్యాన్స్‌తో కయ్యానికి కాలు దువ్వాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ కత్తికి చుక్కలు చూపించారు. ఎలాగోలా ఈ ఎపిసోడ్‌కు బ్రేక్ పడడంతో చాన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నా.. తర్వాత ఓ చానెల్‌లో ప్రసారమైన చర్చా కార్యక్రమంలో శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల ఆగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు, ఈ కారణంతో హైదరాబాద్‌ సిటీ నుంచి ఆయనను అక్కడి పోలీసులు బహిష్కరించారు. ఇక అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటున్నాడు. దీంతో ఆయనను ఏ చానెల్ పట్టించుకోలేదు. ఆ తర్వాత కొద్దిరోజులకు తాను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నానని ప్రకటించాడు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని ఒక పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్లు వెల్లడించాడు. దీని తర్వాత ఇప్పటి వరకు ఆయన మీడియా ముందుకు రాలేదు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటున్నాడు.

మొదటి నుంచీ మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ వస్తున్న కత్తి మహేశ్.. తాజాగా మరోసారి వారిని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశాడు. అంతేకాదు తన లెక్క ప్రకారం జనసేనకు వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయో కూడా అంచనా వేశాడు. ‘‘కాంగ్రెస్ వ్యతిరేకత.. రాజకీయ శూన్యత.. కమ్మ కుల అధికార దాహం.. ఎన్. టి.రామారావు చరిష్మా.. ఇవన్నీ కలిపి తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎనిమిది నెలల కాలంలో అధికారంలోకి వచ్చింది… పవన్ కళ్యాణ్ తెలివి శూన్యత. కొణిదెల బ్రదర్స్/ఫ్యామిలీపై అపనమ్మకం. కాపు కుల అనైక్యత. రాజకీయ సంవృధ్ది(బాబు, జగన్) కలగలిపి పవన్ రాజకీయాలలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు అయినా.. జనసేన 3 నుంచి 7 సీట్లకు మించి గెలవదు’’ అని ఆయన చేసిన పోస్టు తీవ్ర చర్చనీయాంశం అయింది. సినిమాలపై రివ్యూలు రాసే కత్తి మహేశ్.. రాజకీయాలపైనా తనదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నాడు. ఈ పోస్టుపై మిశ్రమ స్పందన వస్తోంది. చాలా విషయాల్లో కత్తి మహేశ్ అంచనాలు నిజమయ్యాయి. మరి జనసేన గెలుచుకునే సీట్ల విషయంలోనూ ఇదే జరగనుందా..? లేక దీనికి భిన్నమైన ఫలితాలు వస్తాయా..? అన్నది ఆసక్తికరంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.