కాటసాని చేరికతో వైకాపాలో ఉత్సాహం

కర్నూలు జిల్లా సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరారు. కృష్ణా జిల్లా కనుమూరు వద్ద సాగుతున్న ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న జగన్‌ను కలిశారు. అక్కడే జగన్ కాటసానికి పార్టీ కండువా కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం నేతగా కాటసానికి ఫ్యాక్షన్ ప్యామిలీగా ముద్రపడటంతో ఐదుసార్లు ఆయన గెలిచినా మంత్రి పదవి రాలేదు. 
కాటసాని రాంభూపాల్ రెడ్డి పార్టీలో చేరడం తమకు చాలా ఆనందంగా ఉందని జగన్ అన్నారు. అనుచరుల కోరిక మేరకు వైసీపీలో చేరినట్లు కాటసాని రాంభూపాల్ రెడ్డి చెప్పారు. కర్నూలు జిల్లాలో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని హామీనిచ్చారు ఈ సందర్భంగా కాటసాని. కాంగ్రెస్ హయాంలో దివంగత సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పని చేశాను. ఇప్పుడు మళ్లీ ఆయన తనయుడు జగన్‌తో కలిసి నడవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు కాటసాని.  
కాటసాని రాంభూల్ రెడ్డి 2014 ఎన్నికల్లో కర్నూలు జిల్లా పాణ్యం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. రెండో స్థానంలో నిలిచారు. అక్కడ పోటీ చేసిన వైకాపా నేత గౌరు చరితారెడ్డి ఎమ్మల్యేగా గెలిచారు. వైకాపా నేత, కర్నూలు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి సతీమణి చరితారెడ్డి కి గట్టి పోటీనిచ్చారు. పాణ్యంలో పోటీ చేసిన మాజీ మంత్రి, టీడీపీ అభ్యర్థి ఏరాసు ప్రతాపరెడ్డికి కేవలం మూడోస్థానం దక్కింది. .బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరి కేవలం నాలుగు వేల ఓట్లు తెచ్చుకుని ఆ తర్వాత స్థానం దక్కించుకున్నారు. ఏరాసు ప్రతాపరెడ్డి తండ్రి అయ్యప్పరెడ్డి ఇక్కడ రెండు సార్లు గెలిచారు. ఆ జిల్లా నేతల చూపు అంతా ఇప్పుడు పాణ్యం మీదనే పడింది. అందుకే కాటసాని రాంభూపాల్ రెడ్డి ముందస్తు చర్చలు జరిపి పోటీ చేసేందుకు సిద్దమయ్యారంటున్నారు. 
కాటసాని రాంభూపాల్ రెడ్డి సోదరుడు రామిరెడ్డి బనగానపల్లె వైకాపా నేతగా ఉన్నారు. రామిరెడ్డి సొంత అల్లుడు నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కావడం విశేషం. మామ వైకాపా, అల్లుడు టీడీపీ. ఇప్పుడు అన్న వైకాపాకు రావడంతో రామిరెడ్డి కుటుంబం సంతోషంగా ఉంది.  
కాటసాని రాంభూల్ రెడ్డి ఎన్నికలకు ముందు  వైకాపాకు వెళదామనుకున్నారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. ఫలితంగా  ఆ సీటును గౌరు చరితకు ఇచ్చారు. ఇక లాభం లేదనుకున్న కాటసాని ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు. హోదా ఇవ్వని బీజేపీలో ఉండే కంటే బయటకు రావడమే మేలు అని భావించారు కాటసాని. అందుకే పార్టీ మారారు. కన్నా లక్ష్మీనారాయణ వెనక్కు తగ్గినా…కాటసాని తాను చెప్పిన సమయానికి వైకాపాలో చేరారు. కర్నూలు జిల్లాలోని ఏదైనా ఎంపీ సీటు నుంచి రామ్ భూపాల్ రెడ్డి పోటీకి దిగే అవకాశాలున్నాయనే చర్చ సాగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.