దమ్ముంటే ఫొటోలు బయటపెట్టండి..

బీజేపీ, జేడీఎస్ లు కుమ్మక్కు అయ్యాయనేది సిఎం సిద్ద రామయ్య చేసిన ఆరోపణ. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఆయన సంపాదించారు. కర్నాటక ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. కింగ్ మేకర్ గా ఉండనున్న జేడీఎస్ ను దువ్వుతోంది. ఇందుకు కుమారస్వామి వర్గం సై అంటోంది. సిఎం స్థాయిలో కుమార స్వామి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు ఎక్కడకు వెళుతున్నారు. ఏం చేస్తున్నారు. ఎక్కడ మీట్ అవుతున్నారనే విషయం పై కూపీ లాగారు. అదే సమయంలో వారిద్దరు మాట్లాడుకుంటున్న వీడియోతో పాటు..ఫోటోలను సిద్ద రామయ్య సంపాదించాడంటున్నారు. వాటిని బయట పెట్టండి. మేము చూస్తామని బీజేపీ, జేడీఎస్ లు గట్టిగానే డిమాండ్ చేస్తున్నాయి. కానీ సిద్దరామయ్య ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. అదే జరిగితే కేంద్ర స్థాయిలో రాహుల్ గాంధీ, సోనియాగాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రాలకు సంబంధించిన అనేక విషయాలను బయట పెట్టాల్సి వస్తోందని బీజేపీ భయపెడుతోంది. ఫలితంగా సిద్దరామయ్య ఏం చేయలేని పరిస్థితికి వచ్చింది. 
                               కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఆధారాలను బయట పెట్టలేకపోతున్నారాయన. కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ ను ఓడించే లక్ష్యంతో బీజేపీ, జేడీఎస్ లు కుమ్మక్కయ్యాయని గతంలోనే ఆరోపణలు వచ్చాయి. అసలు తెలంగాణ సిఎం కేసీఆర్ ను అక్కడకు పంపిందే బీజేపీ అనే వాదన వచ్చింది. ఆ పార్టీకి అవసరమైన ఆర్థిక వనరులను ఇచ్చారనే ప్రచారం ఉంది. ఫలితంగా బీజేపీ ప్రభుత్వం కర్నాటకలో ఏర్పాటు కానుందని అర్థమవుతోంది. మెజార్టీ సీట్లు కాంగ్రెస్ కు వచ్చినా బీజేపీనే అక్కడ అధికారంలోకి రాబోతుందనేది వాస్తవం. 
                                   బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి ఢిల్లీ విమానాశ్రయంలో ప్రత్యేకంగా కలుసుకుని మంతనాలు జరిపారు. ఆ ఫొటోలు తన వద్ద ఉన్నాయని చెబుతున్నారు సిద్దరామయ్య. ‘వారిద్దరూ ఒకే విమానంలో వెళ్లారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కుమ్మక్కై ప్రచారం చేస్తున్నాయి అనేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని ఆయన అన్నారు. ఫోటోలు ఉంటే విడుదల చేస్తేనే ఆయన వాదనకు బలం చేకూరుతోంది. తాను విడుదల చేయకపోయినా మీడియా వారికి ఇచ్చినా బాగానే ఉంటోంది. ఆ పని చేస్తారా లేదా అనేది ఆసక్తికరమే. ఒకవేళ ఆధారాలు బయట పెట్టినా ఎయిర్ పోర్టులో యధాలాపంగా కలిస్తే పలకరించుకోవడం తప్పా అని బీజేపీ, జేడీఎస్ లు ప్రశ్నించే వీలుంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.