గాలికి రోజులు బాలేవు-మాల్యాలాగే గాలి ప‌రార్ !

మ‌రో లంచం ఇచ్చి దొరికిపోయి పరారీలో ఉన్న బీజేపీ నేత, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డికి ఇంకో షాక్ తగిలింది. ఇప్ప‌టికే అనేక కేసుల్లో ఉన్న ఈ బ‌ళ్లారి గ్యాంగ్‌కు రోజులు అస్స‌లు బాగాలేన‌ట్టున్నాయి. మొన్న‌నే ఉప ఎన్నిక‌ల్లో భారీ వ్య‌త్యాసంతో గాలి కుటుంబీకులు ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. తాజాగా గాలి జ‌నార్ద‌న్ రెడ్డి లంచం కేసులో బుక్క‌యి పోలీసుల‌కు దొర‌క్కుండా పరార‌య్యాడు. దీంతో అత‌డి కోసం పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేశారు. ఏ క్ష‌ణం దొరికినా ఆయ‌న‌ను అరెస్టు చేస్తారు. అయితే, ఇప్ప‌టికే మోడీ హ‌యాంలో చాలా మంది విదేశాల‌కు చెక్కేసిన నేప‌థ్యంలో గాలి ప‌రారీలో ఉండ‌టం అనేక అనుమానాల‌కు తావిస్తోంది. పైగా ఇత‌ను బీజేపీ నేత కావ‌డంతో ఆ అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి.

ఇంత‌కీ ఈ కేసేంటి?
2016 ఆర్థిక సంవ‌త్స‌రంలో సయ్యద్ అహ్మద్ ఫరీద్ ఆంబిడెంట్ గ్రూప్ కంపెనీ ఏర్పాటుచేశాడు. ఆ కంపెనీ పేరు చెప్పి వందలాది మంది నుంచి రూ.600 కోట్లు వసూలు చేశాడు. అయితే, పెట్టుబ‌డిదారుల‌కు ఇచ్చిన‌ హామీలు నిలబెట్టుకోవడంలో ఆ కంపెనీ విఫ‌ల‌మైంది. దీంతో కంపెనీ వ్య‌వ‌హారాల‌పై కొంద‌రికి అనుమానం వ‌చ్చింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ‌త ఏడాది జనవరిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆంబిడెంట్ కార్యాలయంలో సోదాలు చేసింది. తాజాగా ఈ కేసును కర్ణాటక క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప్ర‌స్తుతం పోలీసులు అదుపులో ఉన్న ఆంబిడెంట్ వ్యవస్థాపకుడు సయ్యద్ అహ్మద్ కొన్ని సంచ‌ల‌న విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టాడు. ఈడీ నుంచి కాప‌డ‌టానికి మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి సాయం చేస్తాను అన్నార‌ని స‌య్య‌ద్ చెప్పారు. దానికి ప్ర‌తిఫ‌లంగా రమేశ్ కొఠారి అనే బంగారం వ్యాపారి ద్వారా రూ. 18 కోట్ల విలువైన 57 కేజీల బంగారాన్ని గాలి చెప్పిన వారికి ఇచ్చిన‌ట్టు స‌య్య‌ద్ వివ‌రించారు. దీంతో ఈ కేసు గాలి మెడ‌కు చుట్టుకుంది. అస‌లే రాష్ట్రంలో గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి కూల్చాల‌ని ప్ర‌య‌త్నించిన కాంగ్రెస్‌-జేడీఎస్ ప్ర‌భుత్వం ఉండ‌టంతో ఈ కేసును సీరియ‌స్‌గా ప‌రిగ‌ణిస్తార‌ని అనుకున్నారో ఏమో జనార్దనరెడ్డితో పాటు అతని పీఏ అలీఖాన్ ప‌రార‌య్యారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.