కుమారస్వామి ప్రభుత్వం నెలల్లోనే…

కర్నాటకలో కుమారస్వామి ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండేలా లేదు. కాంగ్రెస్ అసమ్మతి నేతలే ఆ ప్రభుత్వాన్ని కూలదోసే వీలుంది. సిద్దరామయ్య ప్రభుత్వంలోని మంత్రులకు ఈ సారి మొండి చూపేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్దమైంది. అలా చేస్తే ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం కొనసాగించేది లేదంటున్నారు సీనియర్లు. అదే ఇప్పుడు తలనొప్పిగా మారింది. బల నిరూపణ చేసుకునే వరకు అందరినీ రిసార్ట్ లో ఉంచిన జేడీఎస్, కాంగ్రెస్ లు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వచ్చింది. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రయోగం చేయడం రిస్క్ అంటున్నారు. అయినా సరే వెనక్కుతగ్గడం లేదు. అదే కుమారస్వామి కొంప కూలుస్తుందంటున్నారు.

ఇప్పడుు ఆ పార్టీ లో గందరగోళం రేపుతున్నాయని కదనాలు వస్తున్నాయి. కొందరైతే కాంగ్రెస్ జెడిఎస్ కూటమి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా కృషి చేశారు. వారిలో డికె. శివకుమార్ ఒకరు. ఆయన ఈ పరిణామాన్ని చూస్తూ సహిస్తారా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కాంగ్రెస్ కు ఇరవైరెండు మంత్రి పదవులు వస్తాయ. కానీ పోటీ మాత్రం తీవ్రంగా ఉండడంతో అధిష్టానం ఈ ఫార్ములాకు ప్రాధాన్యం ఇస్తోందని అంటున్నారు. అంతా కొత్తవారికి అవకాశం ఇస్తే కుమారస్వామి ప్రభుత్వం ఖాయంగా తోస్తోంది. అంతే కాదు…మొన్న 9 మంది ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నప్పటికీ యడ్డురప్ప చేతగానితనంతోనే బల నిరూపణ చేసుకోలేదంటున్నారు. బళ్లారి శ్రీరాములను గౌరవించడంలో యడ్డీ వ్యవహరించిన తీరుతోనే వారు మౌనంగా ఉన్నారంటున్నారు. సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాడే..శ్రీరాములు అపాయింట్ మెంట్ అడిగితే కాదన్నారు సిద్దరామయ్య. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న కాలంలో యడ్డీ తమకు అందడని భావించారు శ్రీరాములు. అందుకే అవకాశం ఉన్నా..ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకోలేదంటున్నారు. ఇప్పుడు అంతా సర్దుబాటు కావడంతో యడ్డీ లైన్లోకి వచ్చారని తెలుస్తోంది. ఫలితంగా నెల రోజుల్లోపే కుమారస్వామి ప్రభుత్వం కూలే అవకాశం ఉందని తెలుస్తోంది.

వాస్తవంగా బల నిరూపణ చేసుకున్నాక ఆరు నెలల వరకు మళ్లీ లెక్కను చూపించాల్సిన అవసరం లేదు. కానీ గవర్నర్ కోరితే ప్రత్యేక పరిస్థితులు వస్తే కుమారస్వామి పోస్టు గల్లంతే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.