రేపు బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం.. అసలేం జరగబోతోంది?

కన్నడ నాట రాజకీయాలు గంట గంటకూ మారిపోతున్నాయి. ఎప్పుడు ఏనేత పార్టీకి గుడ్ బై చెప్పి గోడదూకుతారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో అటు కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ తరఫున గెలిచిన అభ్యర్థులను కాపాడుకునే పనిలో అధిష్ఠానం నిమగ్నమైంది. ఈ విషయంలో మరో ముందడుగేసిన కాంగ్రెస్ పెద్దలు తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌ రెస్టారెంట్లకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

బుధవారం ఉదయం 10:30 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. యడ్యూరప్పను శాసనసభా పక్ష నాయకుడిగా ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. బీజేపీఎల్పీ నేతను ఎన్నుకున్నాక ఫరేడ్‌గా ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను నేతలు కోరనున్నారు.

గవర్నర్‌ భేటీ అనంతరం బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాతో ప్రభుత్వ ఏర్పాటుకై ఎలా ముందుకెళ్లాలి? జేడీఎస్‌ ఎమ్మెల్యేల విషయంలో వ్యవహరించాలి? పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్న కాంగ్రెస్‌‌ను ఎలా ఎదుర్కొనాలి? తదితర అంశాలపై నిశితంగా చర్చించనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.