చివ‌రి నిమిషంలో హైద‌రాబాద్‌కు

క‌న్న‌డ రాజ‌కీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. అతి పెద్ద‌పార్టీగా ఆవిర్భ‌వించిన బీజేపీ ఎలాగైన అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని మ్యాజిక్ ఫిగ‌ర్ సాదించేందుకు ఆప‌రేష‌న్‌లోట‌స్ మొద‌లుపెట్టింది. కాంగ్రెస్-జేడీఎస్‌ల‌కు చెందిన ఎమ్మెల్యేల‌ను ఎలాగైన బీజేపీలోకి లాగి ప్ర‌భుత్వానికి కైవ‌సం చేసుకోవాల‌ని భావించింది. అయితే సుప్రీం కోర్టు వారి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది. శ‌నివారం సాయంత్రం లోపు బ‌ల‌నిరూప‌ణ పూర్తి కావాల‌ని సుప్రీం ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం ఆప‌రేష‌న్ లోట‌స్ నుంచి త‌మ ఎమ్మెల్యేల‌ను కాపాడుకునేందుకు ఇరుపార్టీలు క్యాంపు రాజ‌కీయాలు మొద‌లు పెట్టారు. కర్ణాటక కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ఎమ్మెల్యేల హైదరాబాద్‌ క్యాంప్‌ పర్యటన చివరి నిమిషంలో ఖరారయినట్లు తెలిసింది. అసెంబ్లీలో బలనిరూపణకు సీఎం యడ్యూరప్పకు గవర్నర్‌ 15రోజుల సమయం ఇవ్వటంతో… ముందుగా కొచ్చి వెళ్లి అక్కడ 10 రోజులు గడపాలని ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. తీరా బయల్దేరే సమయానికి…. బెంగళూరు నుంచి కొచ్చికి వెళ్లే మార్గ మధ్యలో ఉన్న అడవిలో రహదారి గేట్లు మూసివేస్తారని… అలా జరిగితే అడవి మధ్యలో చిక్కుకు పోవాల్సి వస్తుందని సంశయిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ వచ్చింది. ఈ క్రమంలో… బెంగళూరు నుంచి పుదుచ్చేరి వెళ్లాలని నిర్ణయించి బయల్దేరినా… మార్గ మధ్యలో హైదరాబాద్‌ అయితేనే బాగుంటుందని నిర్ణయించుకున్నారు. కాగా… హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు ప్రత్యేక విమానాల్లో వెళ్లాలని ముందుగా కాంగ్రెస్‌-జేడీఎస్‌లు నిర్ణయించాయి. విమానాల్లో వెళితే ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వకపోతే సమయానికి అసెంబ్లీకి చేరుకోవటం కష్టమవుతుందని భావించి… రోడ్డు మార్గంలోనే వెళ్లాలని నిర్ణయించారు. శుక్ర‌వారంసాయంత్రం వ‌ర‌కు ఎమ్మెల్యేలు హైద‌రాబాద్‌లోనే గ‌డిపి సాయంత్రం బెంగ‌ళూరు తిరుగుప్ర‌యాణం అయ్యారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.