జగన్‌పై ప్రేమ.. బాబుపై ద్వేషం… ఎందుకు ‘కన్నా’?

ఏపీలో ప్రస్తుతం కాపు రిజర్వేషన్లు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ అంశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొందరపాటు ‌ప్రకటనతో మరోమారు తెరపైకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి అన్ని రాజకీయ పార్టీల నేతల మధ్య వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. అయితే ఇందులోకి అనూహ్యమైన వార్త ఒకటి వినిపిస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఈ వాదప్రతివాదాల జాబితాలో చేరారు. బీజేపీ తరపున మాట్లాడినప్పటికీ వైసీపీ వాదననే ‘కన్నా’ వినిపించారనే వార్తలు వస్తున్నాయి. కాపు రిజర్వేషన్లపై మాట తప్పిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని కన్నావిమర్శలు గుప్పించేశారు. అధికారంలోకి వస్తే కాపులను బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అనంతరం మాట తప్పారని కన్నా విమర్శించారు. నాయకులను చంద్రబాబు రెచ్చగొట్టి కాపులపై దాడుల చేయించారనికూడా పేర్కొన్నారు. గతంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తే బాబు వ్యతిరేకించారన్న సంగతి కూడా మరోమారు గుర్తు చేశారు.
ఉద్యమం చేసిన కాపులను, ముద్రగడ కుటుంబాన్ని చంద్రబాబు పలు ఇబ్బందులకు గురిచేశారని ఆరోపణలు గుప్పించారు. రిజర్వేషన్ల పై నాలుగున్నర ఏళ్లుగా కాలయాపన చేశారని కూడా విమర్శించారు. కన్నా చేసిన ఇటువంటి విమర్శలన్నీ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల్లానే ఉన్నాయి. ఇదిలావుండగా  కన్నా లక్ష్మినారాయణను వైసీపీ సొంత మైకుఅని, బీజేపీ అద్దె మైక్ అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శిస్తూంటారు. రిజర్వేషన్ల వ్యవహారంపై కన్నా స్పందన చూస్తే అలానే ఉందనిపించకమానదు. అయితే ఇక్కడ కన్నాకు వైసీపీ వాదన వినిపించాలని లేకపోయినా ఆయనకు మరో మార్గం లేదని విశ్లేషకులు అంటున్నారు. దీనిని విస్మరిస్తే కాపు రిజర్వేషన్ల అంశం తమ మెడకు చుట్టుకుంటుందేమో అని కన్నా భావిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రత్యేకహోదా అంశంపై ఎలా ముందుకు వెళ్లాలో తెలియకుండావుంది. ఇప్పుడు కాపుల రిజర్వేషన్ల అంశం ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారింది. అందుకే ముందు జాగ్రత్తగా కన్నా లక్ష్మీనారాయణ.. బాబుపై విమర్శల వర్షం కురిపిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.