రంగంలోకి దిగిన కన్నా

మరోసారి ఢిల్లీకి వెళ్లి వచ్చాక కన్నా లక్ష్మీనారాయణ దూకుడు పెంచారు. ఏపీ ప్రభుత్వం పై ఎదురుదాడి వ్యూహంతో వెళుతున్నారు. పార్టీ పెద్దలు చెప్పిన పని చేస్తున్నారు. ముందుగా గవర్నర్ ను కలవాలనేది హైకమాండ్ ఆదేశం. అంతే ఆయన అదే పని చేశాడు. పనిలో పనిగా కొన్ని ఆధారాలను గవర్నర్ కు ఇచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఏపీ మంత్రి భూమా అఖిలప్రియను తక్షణమే బర్తరఫ్‌ చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు ఏపీ బీజేపీ నేతలు. ఏపీలో జరుగుతున్న అవినీతి, దుర్మార్గాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు వాళ్లు. ప్రభుత్వం ఖర్చుతో నిర్వహించిన కార్యక్రామాల్లో పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తే ఊరుకునేదిలేదంటోంది బీజేపీ.

తన అసమర్థతను కప్పిపుచ్చుకోలేక ఎన్డీఏ నుంచి చంద్రబాబు వైదొలిగారని బీజేపీ అంటోంది. 2019 ఎన్నికల్లో గెలవదని భావించే టీడీపీ నేతలు, మంత్రులు ప్రధాని మోదీని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని కమలం పార్టీ ఆరోపిస్తోంది. ప్రధానిని విమర్శించిన ఎమ్మెల్యేలు, మంత్రులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు కన్నా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు. అఖిలప్రియను సైతం బర్తరఫ్‌ చేయాలని గవర్నర్‌ను కోరినట్లు కన్నానే చెప్పారు. అవినీతికి పాల్పడిన వ్యక్తులు ఎవరైనా చర్యలు తీసుకోవాలని తాను కోరినట్లు కన్నా అంటున్నారు.

ఏపీ ప్రభుత్వ సలహాదారు కుటుంబరావు చదువుకున్న మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నారంటూ కన్నా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీలో అరాచక పాలన సాగుతోంది. పోలీస్‌ అధికారులు టీడీపీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారని ఆయన గవర్నర్ కు ఇచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించారు. పోలీస్‌ స్టేషన్లు టీడీపీ నేతలకు కార్యాలయాలుగా మారిపోయాయని సంచలన వ్యాఖ్యలు చేశారాయన. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా తిరుమలకు వస్తే కావాలని చంద్రబాబు దాడులు చేయించారని కన్నా అంటున్నారు.

ఏపీలో జరిగే ప్రతి విషయం పైనా ఎప్పటికప్పుడు బీజేపీ ఆరా తీస్తోంది. తీసుకోవాల్సిన చర్యల పై సమాలోచనలు చేస్తోంది. ఏపీ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన బీజేపీ దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. వీలున్నంత తొందరగా చంద్రబాబును వివిధ కేసుల్లో బుక్ చేసేందుకు చూస్తుందని అర్థమవుతోంది. అఖిల ప్రియకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం సేకరించిందని..ఫలితంగా ముందుగా మంత్రి పై ఆ తర్వాత సిఎం పైనా కేసులువచ్చే వీలుందంటున్నారు. ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతున్న పనేనని అంటున్నారు.

1 Comment

  1. modi desam lo andari nundi 84,000 kotlu vasul chesina money emi chesado chepali. cbi enquiry cheyali. aa tarvata babu meeda enquiry veyali

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.