టీడీపీ పై దాడి మొదలెట్టిన కన్నా

అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాడో లేదో తన పని మొదలెట్టాడు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. బజారులో అక్రమ సంబంధాలు అంటగట్టి 2019లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇదంతా పార్టీ హైకమాండ్ ఆదేశాలతోనే జరుగుతోంది. మీకెందుకు మేము ఉన్నాం. మీ పని మీరు కానివ్వండని బీజేపీ పెద్దలు కన్నా లక్ష్మీనారాయణకు స్పష్టమైన ఆదేశాలిచ్చారట. హస్తినకు పిలిచి మరీ వాస్తవాలు చెప్పారు. ఎదురుదాడి చేయాలనేది ఆదేశం. తాము ఎంత చేసినా చెప్పుకోలేక పోతున్నాం. ఒక వర్గం మీడియా మనకు వ్యతిరేకంగా పని చేస్తోంది. అందుకే తిప్పికొట్టాలని చెప్పారు. తత్వం బోధపడిన కన్నా ఇలా తిరిగి వచ్చారో లేదో అలా తన వాడి వేడి మాటలకు పదును పెట్టారు. 
విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నాలుగేళ్లలో 85 శాతం పూర్తి చేశామని చెప్పారు. మిగతా 15 శాతం హామీలను మాత్రమే అమలు చేయాల్సి ఉందన్నారు. కానీ ఏపీకి ప్రత్యేక హోదా సంగతి చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వ రంగసంస్థలకు నిధులు ఇవ్వని విషయం ప్రస్తావించలేదు. అసలెందుకు విశాఖ రైల్వే జోన్, పోలవరం నిధుల సంగతి ఏంటంటే సమాధనం లేదు. రాష్ట్ర ప్రజల్లో చంద్రబాబు విష బీజాలు నాటుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. అనంతపురానికి సెంట్రల్ యూనివర్సిటీని కేంద్రం ఆమోదించిందని చెప్పారు. ఇంతలో ఎంత మార్పు. పార్టీలో తనకు సరైన ప్రయార్టీ లేదని వైకాపాకు జంప్ చేసేందుకు సిద్దమయ్యారు కన్నా. చివరకు ఆయన్నే అధ్యక్షుడిగా ఎంపిక చేసి మరీ రెడ్ కార్పెట్ పరిచింది బీజేపీ. కాంగ్రెస్ లో బెదిరించినట్లు బీజేపీలోను అదే పని చేశారు కన్నా. అదే ఆయనకు పదవి వచ్చేలా చేసింది.
శివాజీ పై దాడి ఎందుకంటే…
నటుడు శివాజీని గన్నవరం విమానాశ్రయం వద్ద బిజెపి కార్యకర్తలు కావాలని అడ్గుకున్నారు. ప్రధాని మోడీని శివాజీ ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తున్నారని వారు అభ్యంతరం చెప్పారు. టీడీపీకి అనుకూలంగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు శివాజీ. అందుకే అతన్ని బీజేపీ శ్రేణులు టార్గెట్ చేశాయి. పోలీసులు జోక్యం చేసుకుని శివాజీని కారు ఎక్కించి పంపించారు. లేకపోతే ఇబ్బంది వచ్చి పడేది. శివాజీ పై దాడి జరిగేందంటున్నారు. 

1 Comment

  1. orey kanna kotaga emaina chepu. arigina record veyaka. bjp lo entaku mundu chepina valu gadidala. nuvu kota ga vachi chepedi endi. emaina ap ki chesi chupinchu.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.