కన్నాకు పార్టీ పెద్దల నుంచి పిలుపు

బీజేపీ హైకమాండ్ ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను హఠాత్తుగా ఆహ్వానించింది. ఏపీలో టీడీపీ వైభవంగా మహానాడు నిర్వహించింది. అది ఆ పార్టీలో ఉత్సాహాన్ని మరింత పెంచింది. హోదా విషయంలో మాటలు మార్చిన చంద్రబాబు అంతా తానే పోరాటం చేస్తున్నట్లు ప్రకటించాడు. అదే సమయంలో జనసేన, బీజేపీ, వైకాపా పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఫలితంగా జగన్, పవన్ లు గట్టిగానే కౌంటర్లిచ్చారు. కానీ బీజేపీ ఇంకా ఆ పని చేయలేదు. అందుకే కన్నాను హస్తినకు పిలిపించి మరీ కొన్ని కీలక విషయాలను చెప్పేందుకు సిద్దమయ్యారు పార్టీ పెద్దలు. సిఎం చంద్రబాబుకు సంబంధించిన కీలక సమాచారంతో పాటు..కేసులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నారట. ఏ కేసు పెట్టిన బెయిల్ తెచ్చుకోవడం చంద్రబాబు నైజం అని..ఇప్పటికే విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. 
ఇలాంటి సమయంలో ఓటుకు నోటు కేసుతో పాటు..మిగతా అంశాలను తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పట్టిసీమ, పోలవరం అక్రమాల పై కాగ్ నివేదికతో పాటు..మిగతా విషయాల పై సమగ్ర సమాచారం తెప్పించుకుందట కేంద్రం. కర్నాటక అధికారానికి దూరమైనా దక్షిణాది రాష్ట్రాల పై తన ప్రభావం తగ్గకుండా చూడాలనుకుంటోంది. ముఖ్యంగా ఏపీలో కీలక వ్యక్తులను రంగంలోకి దింపే పని చేయనుంది. జేడీ లక్ష్మీనారాయణతో పాటు…మరికొందరినీ బరిలోకి దింపనుంది. ఫలితంగా ఏపీలో చంద్రబాబుకు వేసే ఓట్లను చీల్చడం ద్వారా లబ్దిపొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 
చంద్రబాబు విషయంలో కన్నాకు కొన్ని అస్త్రాలను ఇచ్చి పంపనుందట బీజేపీ. అందుకే హస్తినకు పిలిపించారంటున్నారు.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.