చంద్రబాబుపై ఆ కీలకవర్గం కినుక?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు స్వంత కులస్తుల నుంచి ఎదురుదెబ్బ తగులనుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి చేపట్టిన దగ్గర నుంచి తమ కులానికి ఏమీ చేయలేదనే అభిప్రాయం ఆ సామాజికవర్గంలో వ్యక్తం అవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏకతాటిపై వచ్చి పనిచేసిన ‘కమ్మ’ సామాజికవర్గం ఇప్పుడు ఆయనపై సానుకూలత వ్యక్తం చేయడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. 2014లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడానికి తాము ప్రధాన పాత్ర పోషించామని, పార్టీ కోసం అహరహం పనిచేశామనే భావన ఆ సామాజికవర్గ నాయకుల్లో ఎక్కువగా ఉందట. అదే సమయంలో అదే సామాజికవర్గానికి చెందిన కార్యకర్తలు, సానుభూతిపరులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. రాష్ట్ర జనాభాలో దాదాపు 7శాతం ఉన్న తమ కులంలో అతి పేదరికం అనుభవిస్తున్న వారు ఉన్నారని, వారిని చంద్రబాబు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. ఆ సామాజిక వర్గానికి చెందిన పేరు మోసిన పారిశ్రామికవేత్తలకే మేలు జరిగిందనే ఆరోపణలున్నాయి.
మరోవైపు చంద్రబాబు కుమారుడు లోకేష్‌ ఈ సామాజిక వర్గాన్ని పట్టించుకోరనే విమర్శలు ఎదురవుతున్నాయి. అలాగే రాష్ట్రంలోని మిగతా కులాలు మాత్రం ‘కమ్మ’ సామాజికవర్గానికి చంద్రబాబు దోచిపెడుతున్నారనే ప్రచారం చేస్తున్నారని భోగట్టా! ఏదిఏమైనప్పటికీ కొంత మంది కమ్మ కులస్తులు మాత్రం ఈసారి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని కమ్మ సామాజికవర్గ నేతలు ప్రతిపక్ష వైకాపాతో ఇప్పటికే చేతులు కలిపారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మరికొంతమంది నేతలు ఆ పార్టీ తరుపున పోటీ చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు కొంత మంది కార్యకర్తలు, సానుభూతిపరులు పార్టీ మారడానికి సిద్ధమవుతున్నారట. జగన్‌ అధికారంలోకి వస్తే కమ్మ సామాజిక వర్గానికి ప్రోత్సాహం లభిస్తుందని ఆ పార్టీవారు ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది. వైఎస్‌ హయాంలో ఒక వెలుగు వెలిగిన ఒక పారిశ్రామికవేత్తలు, సినీనటులు ఇందుకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరి చంద్రబాబు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో వేచిచూడాలి!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.