తారక్ సహాయం తీసుకుంటున్న కమల్ హాసన్

కమల్ హాసన్, టాలీవుడ్ స్టార్ హీరో తారక్ సహాయం తీసుకుంటున్నాడట. దక్షిణ భారతదేశంలోనే స్టార్ హీరోగా వెలుగు వెలిగిన కమల్.. తనకంటే వయసులో, అనుభవంలో ఎంతో చిన్నవాడైన తారక్ సహాయం తీసుకోవడమేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా..? మీరు చదివింది నిజమే. తారక్‌ను కమల్ ఓ సహాయం చేయమని కోరారట. అంతటి గొప్ప నటుడు సహాయం కోరడంతో తారక్ వెంటనే ఓకే చెప్పేశాడట. ఓ లెజెండరీ యాక్టర్ తారక్ సహాయం కోరడంతో అతడి ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.

కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం’ సినిమా ఎంతటి వివాదాలను సృష్టించిందో తెలిసిందే. ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న ఆ సినిమా విడుదల మాత్రం గ్రాండ్‌గానే జరిగింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న ఈ సినిమాను ‘విశ్వరూపం 2’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. చిత్రంలో కమల్ హాసన్‌కి జోడీగా పూజా కుమార్, ఆండ్రియా నటిస్తున్నారు. చాలా కాలంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా.. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల కాస్త ఆలస్యమైంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు కమల్ అండ్ టీమ్.

జూన్ 11వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు ‘విశ్వరూపం 2’ ట్రైలర్ విడుదల కానుందని ప్రకటించారు. అయితే ఇక్కడ విశేషమిటంటే.. మూడు భాషల్లో ముగ్గురు స్టార్ నటుల చేతులమీదుగా ఈ ట్రైలర్ విడుదల చేస్తున్నారు. హిందీ వర్షన్‌లో అమీర్ ఖాన్, తమిళ వర్షన్‌లో శృతి హాసన్, తెలుగు వర్షన్‌లో ఎన్టీఆర్ ఈ ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతున్నారు. తెలుగులో ఎంతో మంది నటులున్నా.. కమల్ మాత్రం తారక్ సహాయం కోరడంతో ఫ్యాన్స్ ఎంతో సంతోష పడుతున్నారు. తారక్ ఇటీవల ‘‘భరత్ అను నేను’’ , ‘‘మహానటి’’ సినిమా ఫంక్షన్‌లకు ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.