వైసీపీ మ‌న‌కు అవ‌స‌ర‌మా….బ‌హిరంగ లేఖ..

బ‌హిరంగ లేఖ రాసిన మంత్రి క‌ళా వెంట్రావ్‌
 “ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు అనుగుణంగా ప్రజా రంజక పథకాలను గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంటే కేవలం పదవీ వ్యామోహంతో మంచిని కూడా చూడలేని కబోదిలా వైకాపా పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఒక్కింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయటం ప్రతిపక్షం బాధ్యత. అయితే రాష్ట్రంలో ఇందుకు విరుద్ధంగా ప్రతిపక్షం పరాయిపక్షంలా వ్యవహరిస్తోంది. పేద ప్రజలకు అందే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వైకాపా నేతలు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. రాష్ట్రానికి నమ్మకద్రోహం చేసిన బీజేపీతో కేసుల మాఫీ కోసం లోపాయికారి ఒప్పందాలు చేసుకొని ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టం అంశాల అమలు కోసం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న ధర్మపోరాటాన్ని అడ్డుకునేలా ప్రతిపక్షం వ్యవహరిస్తోంది. ధర్మపోరాటానికి వ్యతిరేకంగా వైకాపా చేసే పోటీ దీక్షలు కేవలం బీజేపీకి లబ్ధి చేకూర్చడానికి మాత్రమే తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి కాదు. వైకాపా చేస్తున్న కపట కార్యక్రమాలు 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆకాంక్షలకు విరుద్ధం. ఇలాంటి పార్టీ రాష్ట్రానికి అవసరమా?
1. లక్ష కోట్ల అవినీతికి పాల్పడి 12 కేసుల్లో ఏ1, ఏ2 ముద్దాయిలుగా ఉంటూ వారానికి ఒక సారి కోర్టుమెట్లెక్కి రాష్ట్ర ప్రజల పరువు తీస్తున్న నాయకులు ఉన్న పార్టీ మనకు అవసరమా?
2. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో బీజేపీతో కలిసి వైకాపా కుట్ర రాజకీయాలకు పాల్పడి కోట్లాడి మంది భక్తుల మనోభావాలను కించపరచలేదా? ఏడు కొండలు కాదు, రెండు కొండలేనని జీవో ఇచ్చిన వారసత్వం రాష్ట్రానికి అవసరమా?
3. శేషాచలం అడవుల్లో  లక్షల ఎర్రచందనం చెట్లు కొట్టి, వేల కోట్లు దోచేసి పర్యావరణానికి ముప్పు కలిగించిన నేరస్థులు ఉన్న పార్టీ అవసరమా? ఎర్రచందనం బడా స్మగ్లర్‌ కొల్లం గంగిరెడ్డితో సంబంధం లేదని వైఎస్‌ జగన్‌ చెప్పగలరా?
4. కర్ణాటక నుంచి కల్తీ మద్యం తెచ్చి అనేక మంది చావులకు కారణమయిన నేరస్తుల పార్టీ వైకాపా కాదా? నెల్లూరులో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డ నేరగాళ్లున్న పార్టీ అవసరమా?
5. క్రికెట్‌ బెట్టింగులు నిర్వహించి యువతను వ్యసనపరులుగా మార్చే ప్రయత్నం చేస్తున్న నాయకులను, ఏటీఎం దొంగలను, 420లను వైకాపా ప్రోత్సహించడం లేదా? అవినీతి డీఎస్పీ ఆస్తులకు బినామీగా ఉంటూ అవినీతికి ఆజ్యం పోస్తున్న శాసనసభ్యులున్న పార్టీ అవసరమా?
6. ప్రపంచ స్థాయి ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వైకాపా ప్రయత్నించలేదా? రైతుల పంట పొలాలను తగులబెట్టి వారి పొట్ట కొట్టాలని చూడలేదా? 33 వేల ఎకరాల భూములు స్వచ్ఛందంగా ఇస్తే వారి త్యాగాన్ని అవమానించేలా దుష్ప్రచారం చేశారు. ల్యాండ్‌ పూలింగ్‌, స్విస్‌ఛాలెంజ్‌ విధానాన్ని అడ్డుకునేందుకు సుప్రీం కోర్టు దాక వెళ్లి రాజధానిని అడ్డుకునే కుట్ర చేస్తున్న పార్టీ అవసరమా?
7. కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వైసీపీ వ్యవహరించలేదా? రైళ్లను తగులబెట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నించే విధ్వంసకర పార్టీ అవసరమా?
8. చంద్రబాబునాయుడు గారు రాత్రింబవళ్లు కష్టపడి దేశ విదేశాల నుంచి అంతర్జాతీయ పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొస్తుంటే పెట్టుబడులు పెట్టొద్దంటూ పారిశ్రామికవేత్తలకు ప్రధాన ప్రతిపక్షం వైకాపా లేఖలు రాయలేదా? విశాఖలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఐఐ సదస్సుకు అడ్డుపడి వికృత చేష్టలు చేసిన పార్టీ అవసరమా?
9.  మా పార్టీ అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామంటూ విశాఖ ఎస్పీ, కృష్ణజిల్లా కలెక్టర్‌ను బెదిరించి జగన్‌ రౌడీయిజం చేయలేదా? అధికారులపై దాడులు చేసిన పార్టీ రాష్ట్రానికి అవసరమా?
10. నవ్యాంధ్ర ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని కాల్చిచంపండి, చెప్పులు, చీపురులతో కొట్టండి అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి నేర సంస్కృతిని పెంచే పార్టీ అవసరమా?
11. బీజేపీతో లాలూచీ రాజకీయాలు చేస్తూ ప్రత్యేకహోదా, కడపస్టీల్‌ప్లాంట్‌, రైల్వేజోన్‌ వంటి కీలక అంశాలను తాట్టు పెట్టే పార్టీ అవసరమా?
12. అసత్యాలతో వైకాపా ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, అవినాష్‌రెడ్డిలు కేంద్రానికి లేఖలు రాసి ఉపాధి హామీ కూలీల పొట్టకొట్టేలేదా? గ్రామాల అభివృద్ధికి నిధులు రాకుండా వైకాపా నాయకులు కుట్ర చేయలేదా? పోలవరం, రాజధానితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడిన పార్టీ అవసరమా?
  వైకాపా పార్టీలో ఉన్న మెజార్టీ నాయకుల మీద ఏదో రూపంలో క్రిమనల్‌ కేసులు ఉన్న వారే. ఇటువంటి దొంగల బండిలో ప్రజలు ఎక్కడానికి సుముఖంగా లేరు. నవ్యాంధ్రకు తీరని అన్యాయం చేసిన బీజేపీ కర్ణాటక ఎన్నికల్లో ఓడిపోవాలని తెలుగు ప్రజలందరూ కోరుకుంటే వైకాపా మాత్రం బీజేపీ గెలుపుకోసం పని చేసింది. వైకాపా నాయకులు కాపు రామచంద్రారెడ్డి కర్ణాటకలో బీజేపీ అభ్యర్ధి కోసం ప్రచారం చేశారు. దొంగ లేఖలు, ఈ-మెయిల్స్‌ ద్వారా రాష్ట్రాభివృద్ధికి అడుగడుగున అడ్డుపడుతున్న పార్టీ అవసరమా? విజ్ఞులైన ప్రజలు ఒక్కసారి ఆలోచించండి.” అంటూ ముగించారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.