క‌డ‌ప రెడ్డిగారికి.. కాలం క‌ల‌సిరావ‌ట్లేద‌ట‌!

పాపం.. ఏమిటో.. ఆయ‌న ఏం చేసినా.. కాలం క‌ల‌సిరావ‌ట్లేదు. వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశం.. ఫేవ‌ర్‌గా మార్చుకుందామ‌నుకున్నా బెడ‌సికొడ‌తుంది.. ఇట్ల‌యితే.. జ‌నం ఏమ‌నుకుంటారు. క‌నీసం.. ఈ విష‌యంలో చంద్ర‌బాబు వంటి వారిని చూసైనా నేర్చుకోపోతే ఎలా! ఎస్‌.. మీరు చ‌దివింది నిజ‌మే.. ఇదంతా.. వైసీపీ అధ‌నేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గురించి.. ఆ పార్టీ సానుభూతిప‌రులు మాట్టాడుకున్న ఆణిముత్యాలు. అంత‌మాత్రాన‌.. వాళ్లంతా బాబును భుజాన వేసుకున్న‌ట్టు కాదండోయ్‌.. ఎందుకంటే.. వ్యూహం విష‌యంలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌పుడు బాబు చాలా చాకచ‌క్యంగా వ్య‌వ‌హ‌రించాడు. ఎక్క‌డ నెగ్గాలో కాదు.. ఎక్క‌డ త‌గ్గాలో అనేందుకు నేనే నిద‌ర్శ‌నం అనేంత‌గా బాబు ఎత్తులు.. అప్ప‌ట్లో విప‌క్షాలు న‌వ్వుకున్నా.. చివ‌ర‌కు.. ఔరా.. నిజ‌మే క‌దా బాబు బాబేనంటూ.. వైసీపీ నేత‌లే అంగీక‌రించారు. అందుకే.. 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు.. బాబు వెంట న‌డిచారు. ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే.. అప్ప‌టి చంద్ర‌బాబు స్థానంలో ఇప్పుడు జ‌గ‌న్ ఉన్నాడు.. నాటి జ‌గ‌న్ స్థానంలో ప‌వ‌న్ ఉన్నాడు.. 2014లో వార్ రెండు సైడ్‌లే.. ఇప్పుడు ముప్పేట పోరు. కాలం క‌ల‌సివ‌స్తే.. కాంగ్రెస్ కూడా మ‌ళ్లీ ఉత్తేజంగా నాలుగు స్తంభాలాట‌కు రెడీ అవుతుంది.
మ‌రి.. పోటీ ఇంత ధీటుగా వున్న‌పుడు .. ప్ర‌తిప‌క్షం అదీ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిగా అధికార పార్టీ భావించే వైసీపీ ఎలా ఉండాలి. నాలుగేళ్లుగా ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పుల‌ను ఎత్తిచూపాలి. అవ‌స‌ర‌మైతే.. స‌ల‌హాలిచ్చి.. ఆ పార్టీ ఆచ‌రించ‌క‌పోతే.. ఇదిగో.. అధికార టీడీపీ త‌ప్పిదాలంట వేలెత్తిచూపే ప‌వ‌ర్ కూడా ఉండేది. పైగా జ‌నాల్లో బోలెడంత సానుభూతి, అభిమానం  పెరిగేది. కానీ.. జ‌గ‌న్ ఓడిన మ‌రుస‌టి రోజు నుంచే సీఎం చంద్ర‌బాబును దించేస్తా.. నేను చిటికేస్తే.. 22 మంది టీడీపీ ఎమ్మెల్యేలు వ‌స్తారంట డాంబికాలు పోయాడు.  త‌న‌కెంత రాజ‌కీయ ప‌రిణితి ఉంద‌నే విష‌యాన్ని స్వ‌యంగా బ‌య‌ట‌పెట్టుకుని ప‌రువు తీసుకున్నాడు. ఆ త‌రువాత‌.. అసెంబ్లీ స‌మావేశాలు బాయ్‌కాట్ చేసి.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అధికార పార్టీను నిల‌దీసే అవ‌కాశాన్ని దూరం చేసుకున్నాడు. పైగా బీజేపీతో స‌యోధ్య అంటూ ఏపీ ప్ర‌త్యేక హోదా మోసం చేసిన క‌మలంలో లాలూచీప‌డ్డాడ‌నే నింద మోస్తున్నాడు.. ఇప్పుడు తాజాగా.. టీటీడీ మాజీ ప్ర‌ధానాచార్యుడ.. ర‌మ‌ణదీక్షితుల‌తో.. స‌మావేశం పెట్టి.. మ‌రీ బుక్క‌య్యాడు.  దీంతో ఇప్ప‌టి వ‌ర‌కూ.. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం విష‌యంలో దోషులుగా వున్న అధికార పార్టీలో నుంచి బంతి.. వైసీపీ కోర్టులో ప‌డింది. ఏమీ చేయ‌ని నేరానికి.. పాపం.. త‌ప్పిదాన్ని మోయాల్సిన స్థాయికిచేరారు. అందుకే.. జ‌గ‌న్‌పై సానుభూతితో.. కొంద‌రు వీరాభిమానులు.. మా రెడ్డిగారు..  వ‌జ్రం ప‌ట్టుకున్నా.. రాయి అవుతుందంటూ తెగ ఫీల‌వుతున్నార‌ట‌. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.