కాలా మూవీ రివ్యూ

నిర్మాణ సంస్థ‌లు: వ‌ండ‌ర్ బార్ ఫిలిమ్స్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్‌
తారాగ‌ణం: ర‌జనీకాంత్‌, నానా ప‌టేక‌ర్‌, హ్యూమా ఖురేషి, ఈశ్వ‌రీరావు, స‌ముద్ర‌ఖ‌ని, అంజ‌లి పాటిల్‌, అర‌వింద్ ఆకాశ్‌, షాయాజీ షిండే త‌దిత‌రులు
మాట‌లు: శ్రీరామ‌కృష్ణ‌
పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌, వ‌న‌మాలి
సంగీతం: స‌ంతోశ్ నారాయ‌ణ్‌
ఛాయాగ్ర‌హ‌ణం: ముర‌ళి.జి
కూర్పు: శ్రీక‌ర్ ప్ర‌సాద్‌
నిర్మాత‌: ధ‌నుష్
ద‌ర్శ‌క‌త్వం: పా.రంజిత్‌

దక్షిణాది సూపర్ స్టార్ రజనీ సినిమా అంటే ఆ క్రేజే వేరు. గత చిత్రాలతో సంబంధం లేకుండా ఏ సినిమాకు ఆ సినిమాలో తన మార్క్ స్టైల్, డైలాగ్ డెలివరీతో మెప్పించే రజనీ కబాలీ వంటి స్టైలిష్ సినిమా తర్వాత చేసిన చిత్రమే ‘‘కాలా’’. రెండేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ముంబై ధారావి అనే ప్రాంతంలోని ఓ డాన్ త‌న ప్రాంతంలోని ప్ర‌జ‌ల కోసం ఏం చేశాడ‌నేదే అస‌లు సినిమా. ఇక ర‌జ‌నీకాంత్‌కున్న మాస్ ఇమేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పన‌క్కర్లేదు. అందులో ఆయ‌న డాన్‌గా న‌టించాడంటే సినిమాపై ఎలాంటి అంచ‌నాలు ఏర్పడుతాయో చెప్పాలా? భారీ అంచ‌నాలు న‌డుమ విడుద‌లైన కాలా ఎలా ఉంది? స‌గ‌టు సినీ అభిమానికి న‌చ్చుతుందా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా క‌థంటో చూద్దాం.

క‌థ‌:
ముంబైలోని దారావి ప్రాంతానికి చెందిన క‌థ సినిమా. ఆ ప్రాంతంలో మ‌కుటం లేని మ‌హారాజు కరికాలుడు(ర‌జ‌నీకాంత్‌). అక్క‌డి ప్రజ‌ల స‌మ‌స్యల‌ను ఎదుర్కొన్నప్పుడు వారికి అండ‌గా నిల‌బ‌డుతుంటాడు. న‌గ‌రానికి న‌డిబొడ్డున ఉండే దారావిపై క‌న్నేసిన రాజ‌కీయ నాయ‌కుడు హ‌రి బాబా(నానా ప‌టేక‌ర్‌).. ప్యూర్ ఇండియా పేరుతో ఆక్రమించుకోవాల‌నుకుంటాడు. అక్క‌డ ప‌క్కా ఇళ్లు కట్టిస్తాన‌నే ప్ర‌తిపాద‌న తెస్తాడు. దానికి కాలా ఎదుర్కొంటాడు. ఈ పోరాటంలో హ‌రి బాబా అనుచ‌రుడు విష్ణుబాబాను కాలా చంపేస్తాడు కూడా. అదే స‌మ‌యంలో ఎన్‌.జి.ఒ వ్యక్తిగా అక్కడి ప్రజ‌ల‌కు స‌పోర్ట్ చేయ‌డానికి జ‌రీనా(హ్యూమా ఖురేషి) ముందుకు వ‌స్తుంది. ఆమె ఎవ‌రో కాదు.. ఒక‌ప్పుడు కాలా పెళ్లి చేసుకోవాల‌నుకున్న అమ్మాయి. అయితే అనుకోకుండా విడిపోవ‌డం. కాలా స్వర్ణ‌(ఈశ్వరీరావు)ను పెళ్లి చేసుకోవ‌డం జ‌రుగుతుంది. హ‌రి బాబా ప్రయ‌త్నాల‌ను కాలా అడ్డుకోవ‌డంతో .. కోపంతో కాలాపై త‌న మ‌నుషుల‌తో ఎటాక్ చేయిస్తాడు హ‌రి బాబా. కానీ కాలా బెద‌ర‌డు. దాంతో అక్కడి మ‌నుషుల మ‌ధ్య గొడ‌వ‌లు సృష్టిస్తారు. అప్పుడు కాలా ఏం చేస్తాడు? త‌న ప్రాంత ప్రజల‌ను ఒక్కటి చేసే ఎలా పోరాడుతాడు? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్‌:
రజనీకాంత్ నటన
దర్శకుడు ఎన్నుకున్న పాయింట్
నానా పటేకర్
ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్

మైన‌స్ పాయింట్స్‌:
స్లో నెరేష‌న్‌
హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేయలేదు
అంద‌రికీ కోర్ థీమ్ న‌చ్చక‌పోవ‌చ్చు
తెలుగు పాట‌ల్లోని సాహిత్యం బాలేదు
ర‌జనీకాంత్‌, జరీనా మ‌ధ్య సన్నివేశాలు గొప్ప‌గా లేవు

సమీక్ష‌:
క‌రికాలుడు అలియాస్ కాలాగా ర‌జ‌నీకాంత్ త‌న‌దైన మాస్ పెర్‌ఫార్‌మెన్స్‌తో ఆక్టుకున్నారు. సినిమా అంతా ఆయ‌న చుట్టూనే తిరుగుతుంది. ర‌జ‌నీకాంత్ సినిమా అంటే మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా ఉండాల‌నుకునే ప్రేక్షకుడికి ఇది డిఫ‌రెంట్‌గా అనిపిస్తుది. క‌బాలిలో ఫ‌స్టాఫ్‌లో ర‌జ‌నీకాంత్‌ను మాస్ హీరోగా చూపించి.. సెకండాఫ్‌లో ఫ్యామిలీ హీరోగా చూపించిన పా.రంజిత్ ఇందులో ఫ‌స్టాఫ్ అంతా ఫ్యామిలీ మేన్‌లా చూపించారు. ఫ్లాష్ బ్యాక్‌లో హ్యూమాతో ర‌జ‌నీకాంత్ ప్రేమ‌.. విఫ‌లం చెంద‌డం.. ఈశ్వ‌రీరావు, ర‌జ‌నీ మ‌ధ్య స‌న్నివేశాలు బావున్నాయి. ముఖ్యంగా ఈశ్వరీరావు న‌ట‌న ప్రేక్షకుల‌ను మెప్పిస్తుంది. పా.రంజిత్ ఈ సినిమాలో ఓ కోర్ పాయింట్‌.. పేద‌వాడు ఉండ‌టానికి చోటు కావాలి. ఇంత పెద్ద దేశంలో ఇంకా పేద‌వాడికి ఉండ‌టానికి ఇళ్లు ఎందుకు లేవు. అనే ప్రశ్నను రైజ్ చేయించాడు. ర‌జ‌నీకాంత్‌లాంటి మాస్ హీరోతో ఇలాంటి సినిమా చేయ‌డం గ్రేట్‌. ర‌జ‌నీ కూడా నేను ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేయాల‌ని కాకుండా ఓ మంచి మెసేజ్ ఉన్న సినిమా చేయాల‌ని ఆలోచించి ఇమేజ్‌కి భిన్నంగా చేసిన సినిమా ఇది. నానా ప‌టేక‌ర్ న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్పన‌క్కర్లేదు. స‌ముద్ర‌ఖ‌ని పాత్ర ప‌రిధి మేర చ‌క్కగా ఉంది. ఇక సాంతికేకంగా చూస్తే ముర‌ళి.జి సినిమాటోగ్రఫీ చాలా బావుంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ సంతోశ్ నారాయ‌ణ్ సంగీతం, నేప‌థ్య సంగీతం ఒకే. సినిమాలో ర‌జనీ చేసే ఫ్లై ఓవ‌ర్ ఫైట్ సీన్‌.. ఇంట‌ర్వెల్ బ్లాక్ మెప్పిస్తాయి. రంజిత్ మార్కు మూవీ కాలా .

చివ‌ర‌గా: కాలా.. ఏందీ గోల

రేటింగ్‌: 2/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.