కాగ్ లెక్క‌లు కేసీఆర్ కు చుక్క‌లు చూపిస్తుందిగా….

తెలంగాణ‌లో టీఆర్ ఎస్ ఎదురుమ‌రో పార్టీ లేకుండా చేసేందుకు కేసీఆర్ అనేక పాచిక‌లు వేసారు. టీడీపీ, కాంగ్రెస్ , బీజేపీ నుంచి ఎమ్మెల్యేల‌తో పాటు మంచి ప‌ట్టున్న నేత‌ల‌ను త‌న జ‌ట్టులోకి చేర్చుకున్నాడు. అయిన‌ప్ప‌టికి ఉన్న నాయ‌కుల‌తో 2019 ఎన్నిక‌ల్లో ఎలాగైన అధికారం చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా విమ‌ర్శ‌లు చేస్తున‌ప్ప‌టికి స‌రైన అవ‌కాశం వారికి ద‌క్క‌లేదు.  దీంతో ప్ర‌భుత్వం చేసిన త‌ప్పిదాల‌పై  టి కాంగ్రెస్ నేత‌లు బుత‌ద్దం వేసి మ‌రీ వెతుకున్నారు. ఈ త‌రుణంలో కాగ్ రిపోర్ట్ వారికి ఆయుధం మారింది. ఇప్ప‌టికి కాగ్ నివేధిక‌ల‌ను తెప్పించుకున్న రేవంత్ రెడ్డి దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌తంలో త‌న ఆరోప‌ణ‌ల‌కు కాగ్ నివేధిక బ‌లం చేకూరుస్తుంద‌ని ఆయ‌న అంటున్నారు. తప్పుడు లెక్కలతో  తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళాతీయించాడ‌ని రేవంత్ ఆరోపించారు. కమిషన్ ల కక్కుర్తి కోసం అప్పులు తెచ్చెన్దుకు మిగులు బడ్జెట్ గా కేసీఆర్ ప్రచారం చేసుకున్నారంటూ విమ‌ర్శించారు. ఇంకా రేవంత్ ఏమ‌న్నాడంట కాగ్ రిపోర్ట్ తో విద్యుత్ కొనుగోలులో అవినీతి జరిగిందన్న మావాదన నిజమని తేలిపోయింది…కేసీఆర్ ,,రాష్ట్ర ఆర్థిక స్థితి పై శ్వేత పత్రం విడుదల చేయాలి ..రాష్ట్ర ఆర్థిక దివాళాను సాకుగా చూపి మంత్రి ఈటెలను తప్పించాలని కేసీఆర్ చూస్తున్నారు ..లక్ష నలభై వేల మిగులు ఉండగా ..ప్రభుత్వం మళ్ళి వేల కోట్లు అప్పులు ఎందుకు తెచ్చినట్లు ..?…ఆర్థిక శాఖా సమీక్షలకు మంత్రి ఈటెల లేకుండా సీఎం చేసింది నిజం కాదా ..
సీఎం వైఖరి చూసి తట్టుకోలేక మంత్రి ఈటెల ఏడ్చింది సంగతి నిజం కాదా ..?ఆర్థిక శాఖా తో సంబంధలేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా సీఎం కాంట్రాక్టర్ల కు బిల్లులు చెల్లిస్తున్నది వాస్తవమ‌న్నారు. ఈటెలను తప్పించడం ఖాయం గా కనిపిస్తుంది ..కేటీఆర్ సీఎం అయ్యేందుకు అడ్డువస్తున్నారనే ఈటెలను తప్పించాలని కుట్ర జరుగుతుంది ..గతంలో సింగరేణిని నిండా ముంచిన రామకృష్ణారావు కు ఇప్పుడు ఆర్థిక శాఖ కార్యదర్శిగా కేసీఆర్ పెట్టుకున్నారని  విమ‌ర్శించారు. ఈ ఆరోప‌ణ‌ల‌ను తిప్పి కొట్టేందుకు కేసీఆర్ అండ్ టీం అస్త్రాల‌ను సిద్దం చేసుకుంటుంద‌ట‌. అయితే కాగ్ నివేధిక అబ‌ద్దం అని  చెప్పాల‌ని పాల‌కులు బావిస్తున్నారు. కాని ఇదిప్ర‌జ‌లు న‌మ్ముతారా…..

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.