జేడీఎస్ లో ముసలం… కొడుకులిద్దరూ చెరో దారి

కర్ణాటక ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. ప్రభుత్వం ఏర్పాటు కోసం కాంగ్రెస్ బీజేపీలు రెండు ముమ్మరంగా పావులు కదుపుతున్నాయి. ఆరెండు పార్టీలు జేడీఎస్ పైనే ఆధారపడ్డాయి. ఫలితంగా దేవెగౌడ కుటుంబంలో చీలిక ఏర్పడింది. కుమారస్వామిని కాంగ్రెస్ కలుపుకుంటే… ఆయన సోదరుడు రేవణ్ణను బీజేపీ దగ్గరకు తీస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మేజిక్ ఫిగర్ 112 ఎవరికీ రాకపోవడమే ఇందుకు కారణం. తమకు సి.ఎం సీటు రాకపోయినా పర్వాలేదు. బీజేపీకి అది దక్కకుండా చేయాలని హస్తం పార్టీ ఎత్తులు వేస్తోంది. మరోవైపు జేడిఎస్ ను చీల్చి అయినా సరే కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకునే వ్యూహంతో వెళుతోంది. ఫలితంగా గవర్నర్ విజయ్ భాయ్ వాలా ఏంచేస్తారనే చర్చ సాగుతోంది. 
కుమార స్వామి సీఎం కాబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నా.. అది అంత తేలిక కాదంటున్నారు. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా యాక్షన్ ప్లాన్‌ను మొదలుపెట్టారు. కర్ణాటక బీజేపీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌తో అమిత్ షా మంతనాలు జరిపి చేయాల్సిన పనిని అమలు చేశారు. అంతే జేడీ(ఎస్) తరపున గెలిచిన 10మంది ఎమ్మెల్యేలతో అమిత్ షా మాట్లాడుతున్నారు. ఇంకోవైపు ప్రకాష్ జవదేకర్, ధర్మేంద్ర ప్రధాన్, జేపీ నడ్డాలు బెంగళూరుకు చేరారు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అన్ని అవకాశాల పైనా వారు ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు. 
బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రయత్నాలు చేయడం కొత్త రాజకీయ సమీకరణలను తెరపైకి తెచ్చింది. గతంలో గోవాలాంటి రాష్ట్రాలను వదులుకున్న కాంగ్రెస్ ఈ సారి అలా చేయడానికి సిద్దంగాలేదు. అందుకే గట్టిగానే పావులు కదుపుతోంది. గవర్నర్ వాలా కాంగ్రెస్ నేతలకు తొలిగా అపాయింట్ మెంట్ ఇవ్వక పోవడం ఉత్కంఠను పెంచుతోంది. ఇంకోవైపు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. దళపతి దేవెగౌడతో మాట్లాడి తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. జేడీఎస్ కీలక నేత, దేవెగౌడ పెద్ద కొడుకు రేవణ్ణ హఠాత్తుగా ఇలా ఎదురు తిరుగుతాడని కాంగ్రెస్ ఊహించలేక పోయింది. ఫలితంగా ఇప్పుడు జేడీఎస్ పరువు బజారున పడింది. కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమే ఎక్కువగా ఉంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.