రాజకీయాల్లోకి వస్తున్నాననేది పుకారే….జేడీ

సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదు. కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకే ఈ పని చేశారనే ప్రచారం జోరుగా సాగింది. అటువైపు నుంచి ఇంత వరకు మాటలు లేవు. అన్నీ ఊహగానాలే. ఇప్పుడు దీని పై వివరణ ఇచ్చారు లక్ష్మీనారాయణ. తాను ఏ పార్టీ వైపు వెళ్లడం లేదన్నారు. అందులోను జనసేనలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారాయన. ఇవన్నీ మీడియా సృష్టిస్తున్న కథనాలేనన్నారు. మరోవైపు జనసేనాని పవన్ కల్యాణ్ దీని పై స్పందించారు. జేడీ పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామన్నారు. 
 
తన రాజీనామాను ప్రభుత్వం ఆమోదిస్తే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు జేడీ లక్ష్మీనారాయణ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై లోక్ సత్తా వ్యవస్ధాపక అధ్యక్షుడు జయ ప్రకాశ్ నారాయణ అసంతృప్తి వ్యక్తం చేసినసంగతి తెలిసిందే. జేఎఫ్‌సీపై తొలుత పవన్ చూపిన శ్రద్ధ ప్రస్తుతం లేదని జేపీ అన్నారు. అందుకే స్వతంత్ర నిపుణులతో మరో కమిటీ ఏర్పాటు చేసినట్టు జేపీప్రకటించడం సంచలనం రేపింది. 
మరోవైపు జేడీ లక్ష్మీనారాయణ కోసం గాలం వేస్తోంది బీజేపీ. టీడీపీలో చేరే ఆలోచన చేయడం లేదట జేడీ. కానీ వైకాపా, జనసేన, బీజేపీ కూటమిలో కచ్చితంగా చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. విఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నా…రాజకీయ భవిష్యత్ పై క్లారిటీ వస్తేనే పదవి విరమణకు ఆమోదం తెలుపుతారనే చర్చ సాగుతోంది. పూటకొక మాట మాట్లాడే పవన్ కల్యాణ్  పార్టీలో జేడీ చేరితే ఉన్న పేరు కాస్త పోతుందనే వాదనుంది.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.