బీజేపీలో చేరనున్న జేడీ లక్ష్మీనారాయణ

ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజల బాట పట్టిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీ నారాయణ బీజేపీలో చేరనున్నారు. ఆయన వెనుక బీజేపీ ఉందని తెలుస్తోంది. టీడీపీలో జేడీ చేరతారనే ప్రచారం వచ్చినా అది నిజం కాదని తెలుస్తోంది. జేడీ అనుచరులు, కుటుంబ సభ్యులు చెబుతున్న లెక్కల ప్రకారం లక్ష్మీనారాయణ రెండు నెలల వ్యవధిలోనే తన పార్టీ చేరికపై స్పందించనున్నారు. జేడీ లక్ష్మీనారాయణ చేరికకు ముందే ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే వీలుంది. ఏపీ సిఎం చంద్రబాబుపై కేసులు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ సానుకూల నిర్ణయం తీసుకుంటోంది. అదే జరిగితే బీజేపీపై వ్యతిరేకత తగ్గుతోంది. దాన్ని తనకు అనుకూలంగా మలచుకునేందుకు కమలం పెద్దలు మాస్టర్ ప్లాన్ వేశారంటున్నారు. అమ్ముల పొదిలో ఉన్న కత్తిని వెలికి తీసినట్లు జేడీ లక్ష్మీనారాయణను ఏపీ పొలిటిక్స్ లో ఎంట్రీ చేయిస్తారని తెలుస్తోంది. 
జేడీ లక్ష్మీనారాయణ ఇప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. పల్లెసీమల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రస్తావిస్తున్నారు. ఫలితంగా జేడీ చాలా క్లారిటీగా ఉన్నారు. ముందుగానే తాను ఏం చేయదల్చుకుంది వారికి విడమరిచి చెబుతున్నారు. ఇంకోవైపు టీడీపీ సీనియర్లు లక్ష్మీనారాయణతో టచ్ లో ఉన్నప్పటికీ రాజకీయాల విషయంలో తాను ఏం చేయదల్చుకున్నారో అది చేస్తారట. జనసేన, టీడీపీ నేతలు జేడీని తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించాయంటున్నారు. కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత జేడీ చేరిక విషయంలో స్పష్టత రానుంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.