జేడీ ల‌క్ష్మినారాయ‌ణ కొత్త‌పార్టీ రెడీ అవుతుందా!

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్ట‌ర్ ల‌క్ష్మినారాయ‌ణ స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ పెను సంచ‌ల‌న‌మే. వైఎస్ జ‌గ‌న్ కేసులో కీల‌క సాక్ష్యాలు సేక‌రించి.. జ‌గ‌న్‌ను జైలుకు పంపిన అధికారిగా జాతీయ‌స్థాయిలో గుర్తింపు పొందారు. మ‌హారాష్ట్ర కేడ‌ర్ ఐపీఎస్‌గా నిజాయ‌తీప‌రుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇంకా దాదాపు ప‌దేళ్ల స‌ర్వీసు.. బోలెడు ప‌దోన్న‌తులు పొందే స‌మ‌యంలో.. ఆయ‌న నిర్ణ‌యం.. పోలీసుశాఖ‌లో సంచ‌ల‌న‌మే అయింది. అనంత‌రం.. ఆయ‌నపై ఎన్నో ఊహాగానాలు.. టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన‌లో చేర‌తార‌ని పుకార్లు వ‌చ్చాయి. 2014లో టీడీపీ నుంచి టికెట్ పొంది గెల‌వాల‌ని ఆశ‌ప‌డ్డార‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. దీన్ని ఆయ‌న మాత్రం సున్నితంగా కొట్టిపారేశారు. తాను స‌మాజ సేవ చేయాల‌నే ఆలోచ‌న‌తోనే రాజీనామా చేసిన‌ట్లు చెప్పుకొచ్చారు.
 కొద్దిరోజులుగా ఆయ‌న ప్ర‌తి కార్యక్ర‌మంలో విరివిగా పాల్గొంటున్నారు. యువ‌త‌లో కూడా మంచి ఇమేజ్ సంపాదించారు. ఇటువంటి స‌మ‌యంలో ఆయ‌న గురించిన కొత్త విషయాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం పార్టీ ఏర్పాటు చేసే యోచ‌న‌లో కొంద‌రు అధికారులు, సీనియ‌ర్ రాజ‌కీయ‌నేత‌ల‌తో మంత‌నాలు జ‌రుపుతున్నార‌ట‌. ఇప్పుడున్న ప‌రిస్థితిలో పార్టీ ఎలా ఉండాలి.. ఏ విధంగా ఉంటే.. ప్ర‌జాధ‌ర‌ణ పొందొచ్చు అనే అంశాల‌పై కూడా స‌ర్వే చేయిస్తున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టెక్నాల‌జీ, సోష‌ల్ మీడియా ద్వారా యువ‌త ఆలోచ‌న‌లు తెలుసుకునే ప్ర‌య‌త్నం కూడా సాగుతుంద‌ట‌. ఇదే నిజ‌మైతే.. ఆయ‌న ఎవ‌రికి మ‌ద్ద‌తిస్తారు. ఆయ‌న చీల్చ‌బోయే కొన్ని ఓట్ల‌యినా ఏ పార్టీకు ఎస‌రు తెస్తాయనే విశ్లేష‌ణ‌లు చేసుకునే ప‌నిలో ఆల్రెడీ పార్టీలు మునిగిపోయాయ‌ట‌. 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.