వైకాపాలోకి జేసీ పవన్

జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్. ఆఫ్రికాలో బంగారం వ్యాపారం బాగా చేస్తున్నాడు. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఆయన చూపు ఇప్పుడు వైకాపాపై ఉంది. రానున్న ఎన్నికల్లో ఆయన జగన్ పార్టీ పక్షాన పోటీ చేస్తాడనే చర్చ అనంతపురంలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే జగన్ పార్టీ నేతలతో అతను టచ్ లో ఉన్నాడంటున్నారు. జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీ. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే. వారిద్దరు టీడీపీలోనే ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చారు. జగన్ ను మా వాడు. మా వాడు అంటూనే దెప్పిపొడుస్తాడు జేసీ దివాకర్ రెడ్డి. కానీ అలాంటి జగన్ వద్దకే కొడుకును పంపించేందుకు జేసీ దివాకర్ రెడ్డి పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేసేది లేదని ఇప్పటికే చెప్పేశారు జేసీ. కానీ తన వారసుడు పవన్ రెడ్డి రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు. 
పవన్ రెడ్డి ఇప్పుడు టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా.. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైకాపాలో చేరతారని సమాచారం. అవరమైతే పార్టీకి కొంత ఫండ్ ఇచ్చేందుకు ఆయన సిద్దమవుతున్నారంటున్నారు. అనంతలో జేసీ కుటుంబానికి పరిటాల కుటుంబానికి పొసగడం లేదు. అంతే కాదు.. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితోను ఇబ్బందులు ఉన్నాయి. అందుకే వారితో కలిసి పోయే కంటే వైకాపాకు వెళితే మంచిదనేది వారి ఆలోచనగా ఉందట.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.