జేసీ త‌న‌యుడా మ‌జాకా!

జేసీ ప‌వ‌న్‌రెడ్డి.. అనంత‌పురం రాజ‌కీయాల్లో మ‌రో వార‌సుడు. ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి త‌న‌యుడు. జేసీ గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీలోకి రావ‌టం వెనుక  ప్ర‌ధాన ఉద్దేశం కూడా కొడుకును రాజ‌కీయంగా కీల‌క నేత‌గా మార్చేందుకు అనే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇది నిజ‌మ‌నేందుకు నిద‌ర్శ‌నంగా ప‌వ‌న్‌రెడ్డి క‌ద‌లిక‌లున్నాయి. వాస్త‌వానికి జేసీ సోద‌రులిద్ద‌రిదీ రాజ‌కీయంగా పేరున్న కుటుంబ‌మే. ఫ్యాక్ష‌నిజంలో రాటుదేలిన ఇద్ద‌ర‌న్న‌ద‌మ్ములు త‌మకంటూ వ‌ర్గాన్ని కూడ‌గ‌ట్టుకున్నారు. ఓ విధంగా చెప్పాలంటే వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డితో ఢీ అంటూ దిగిన బ్ర‌ద‌ర్స్ అని చెప్పాలి. దాని ఫ‌లితంగానే గ‌తంలో వైఎస్ కేబినెట్‌లో బెర్తు ద‌క్క‌లేదు. అంత సీనియ‌ర్ నేత‌గా హ‌స్తం.. పెద్ద‌గా గుర్తించిన దాఖ‌లాల్లేవు. ప‌రిటాల ర‌వి మ‌ర్డ‌ర్ కేసులో జేసీ బ్ర‌ద‌ర్స్ పేరు వినిపించినా.. అది కాస్త‌.. వైఎస్ ఫ్యామిలీ ఖాతాలో చేరింది. అటువంటి కుటుంబం నుంచి వ‌చ్చే ప‌వ‌న్ తండ్రిని మించి రాజ‌కీయ ఎత్తుల‌కు ఇప్ప‌టికే వ్యూహం సిద్ధం  చేసుకున్నాడు. తండ్రి మాట‌తీరు.. వ‌యోభారంతో ఈ సారి.. ఏ పార్టీ సీటిచ్చే అవ‌కాశం లేద‌నేది ఇప్ప‌టికే క్లారిటీకి వచ్చాడ‌ట‌. అందుకే త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్‌ను ఏర్ప‌రచుకునే క్ర‌మంలో పావులు క‌దుపుతున్నాడు. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కూ వ‌ర్క‌వుట్ అయిన‌ట్టుగానే ప‌వ‌న్ వ‌ర్గం భావిస్తుంది. సీమ‌లో పక్క‌నే ఉంటూ.. చివ‌ర్లో వెన్నుపోటు పొడిచే అల‌వాటు ఎక్కువ‌నే చెప్పాలి.
అదే స‌మ‌యంలో 2019లో  అనంత‌పురం ఎంపీగా టీడీపీ నుంచి చాలామంది ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వారిలో కొత్త నేత‌ల‌తోపాటు.. లోకేష్  వ‌ర్గంగా భావిస్తున్న‌వారూ ఉన్నారు. ఇక ప‌రిటాల ర‌వి త‌న‌యుడు ప‌రిటాల ర‌వి కూడా ఈ సారి త‌న‌కు ఎంపీ సీటు కావాలంటూ  చంద్ర‌బాబుపై ఒత్తిడి తెస్తున్నార‌ట‌. కాదంటే… మ‌రో దారి చూసుకోవాల్సి ఉంటుంద‌నే సంకేతాలు కూడా ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఇవ‌న్నీ ఓ కంట గ‌మ‌నిస్తున్న ప‌వ‌న్ చాప‌కింద నీరులా త‌న ప‌ని తాను చేసుకుంటున్నాడ‌ట‌. అటు ప‌వ‌న్‌తో ట‌చ్‌లో ఉంటూ.. సీమ రాజ‌కీయాల గురించి జ‌న‌సేన శ్రేణుల‌తో చ‌ర్చిస్తున్నాడ‌ట. ఒక‌వేళ అక్క‌డ కాదంటే.. వైసీపీ ఉండ‌నే ఉంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ లాంటి నాయ‌కుడు వైసీపీకు చాలా అవ‌స‌రం. రాజ‌కీయంగా సామాజికంగా కూడా.. ప‌వ‌న్ స‌మ‌ర్థుడు కావ‌టంతో.. ఎవ‌రూ త‌న‌ను కాద‌న‌ర‌నే న‌మ్మ‌కం ఉంద‌ట‌. ఈ లెక్క‌న‌.. జేసీ దివాక‌ర్‌రెడ్డితో పోల్సితే… ప‌వ‌న్‌రెడ్డి ప‌ది ఆకులు సారీ.. యాభై ఆకులు ఎక్కువే చ‌దివిన‌ట్టే అనుకోవాలి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.