‘ఏమయ్యా పోసానీ …’ అంటూ జనసేన సెటైర్!

విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి ఈ మధ్య రాజకీయాల గురించే ఎక్కువగా మాట్లాడుతున్నాడు. వైసీపీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నాడో ఏమో కానీ.. జగన్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. జగన్ వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని గొంతువిప్పి చెబుతున్నాడు. అదే నేపథ్యంలో అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నాడు. సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌పై ఆరోపణలు చేస్తున్నాడు. ఇంత వరకూ బాగానే ఉన్నా జగన్‌ను కాకాపట్టేందుకు ఆయనను మించిన నాయుకుడు లేడంటూ పోసాని కితాబివ్వడం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తీసికట్టుగా మారింది. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి అయిన పోసాని.. అదే పరిశ్రమ నుంచి వచ్చిన తమ నాయకుడు పవన్ కల్యాణ్ చేస్తున్నపోరాటాన్ని ఎందుకు గుర్తించడం లేదని జనసేన ప్రశ్నిస్తోంది. ప్రజాసమస్యలపై ప్రతిపక్షనేతకన్నా ఎక్కువగానే జనసేనాని పోరాడుతుంటే అది పోసానికి కనిపించడం లేదా అని జనసేన సోషల్‌మీడియా వింగ్ ‘శతఘ్ని మిస్సైల్’ నిలదీస్తోంది. ‘ఏమయ్యా పోసానీ …’ అంటూ అత్తారింటింకి దారేది సినిమాలోని స్టిల్‌ను పోస్ట్ చేసింది.

‘‘ఏమయ్యా పోసానీ …
నువ్వు చెప్పే నీతులు బాగానే ఉన్నాయి కాని జగన్ అవినీతి ఎందుకు కనిపించట్లేదు ?
ప్రతీ శుక్రవారం జగన్ కోర్టుకు వెళ్తున్నాడా,రిలీజ్ సినిమాకు వెళ్తున్నాడా?
అవినీతి చేసిందని టీడీపీ ఓటు వైసీపీకి వేస్తే మళ్ళీ అవినీతిని ఎన్నుకునట్టే కదా?

ఇక నువ్వు ఫైట్ చేసేది దేని కోసం?’’ అంటూ శతఘ్ని చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.