పవన్ యాత్రకు జన స్పందన

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ బస్సుయాత్ర ప్రారంభమైంది. ప్రజా సమస్యలు తెలుసుకోవడం, ప్రభుత్వ వ్యతిరేక విధానాల పై పోరాడటం, పార్టీని గ్రామ స్థాయిలో పటిష్టం చేసుకోవడం,క్యాడర్ లో ఉత్సాహం నింపడం, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని కోరడం వంటి విషయాల పై ఆయన దృష్టి సారించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ఈ యాత్ర మొదలైంది. ముందుగానే ఇచ్ఛాపురం చేరుకున్న పవన్ అక్కడి నేతలతో మాట్లాడారు. ఏపీలోని అన్ని జిల్లాలో బస్సుయాత్ర సాగనుంది. ఏకధాటిగా 40 రోజుల పాటు ఈ యాత్ర సాగనుండగా..ఇప్పటికే ప్రచారం విషయంలో పవన్ వెనుకబడిన సంగతి తెలిసిందే. గతంలో ఇచ్చిన ప్రయార్టీ పవన్ కు మీడియా ఇవ్వడం లేదు. అదే సమయంలో పవన్ పక్కన ఉన్న బౌన్సర్లు మీడియా ప్రతినిధులను టార్గెట్ చేసి మరీ దాడి చేస్తున్న సంఘటనలు ఉంటున్నాయి. అది జనసేనకు ఇబ్బంది కలిగించే అంశమేనని చెప్పాలి. 
అసమానతలు లేని సమాజం కోసం ప్రయత్నిస్తున్నానని, అందుకే ప్రజా పోరాటయాత్ర ప్రారంభించానని పవన్‌ అంటున్నారు. ప్రజారాజ్యం పార్టీ పుట్టుక నుంచి విలీనం వరకు అన్నీ ప్రత్యక్షంగా చూశాడు పవన్. ఆ తర్వాత కూడా పార్టీ పెట్టానంటే.. ఏ లక్ష్యం కోసం ఇవన్నీ చేస్తున్నానో అవగాహన చేసుకోవాలని పవన్ అంటున్నారు. అన్నీ వదిలేసి వచ్చిన తనకు ఏ భయం లేదని, దేనిని లెక్క చేయనని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కపాసకుద్ది సముద్రతీరంలో గంగమ్మపూజ చేసిన తర్వాత తన కార్యక్రమాలను మొదలుపెట్టారాయన. 8 గంటలకు ఇచ్ఛాపురం స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శించుకుని మిగతా పనులు ప్రారంభించారు. పవన్ కల్యాణ్ వచ్చారని తెలియగానే..చిక్కోలు జిల్లా వాసులు పెద్ద ఎత్తున ఆయన్ను చూసేందుకు తరలి వచ్చారు. నటుడు కావడంతో పార్టీలకతీతంగా ఆయన వద్దకు చేరుతున్నారు. వాటిని ఓట్లుగా మలచుకోవడంలో పవన్ సక్సెస్ సాధిస్తే సరే. లేకపోతే చిరంజీవి లాగా పార్టీ జెండాను మధ్యలోనే వదిలేయాల్సి వస్తోంది. చిరంజీవికి వచ్చిన జనం..తెలుగు రాష్ట్రాల్లో మరో నేతకు రాలేదు. అన్న ఎన్టీఆర్ తర్వాత అంత స్థాయిలో చిరుకు జనం వచ్చారు. కానీ ఆయన సొంతూరులోనే ఓడిపోయిన సంగతి తెలిసిందే. అలా కాకుండా ఉండాలంటే పవన్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. టీడీపీ పై ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు ఉండాలి. లేకపోతే ఒకే స్టాండ్ మీద ఉండాలి. అవేం లేకపోవడం..ఎవరో చెప్పారని దూకుడుగా మాట్లాడటం వెనక్కు తగ్గడం ప్రజల్లో ఆయనకున్న గుడ్ విల్ ను దెబ్బతీస్తోంది. అందుకే అప్రమత్తంగా ఉండాలంటున్నారు విశ్లేషకులు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.