ప‌వ‌న్ సంచ‌ల‌నం- బీజేపీతో క‌ల‌వ‌క త‌ప్ప‌దు !!

పవన్ కల్యాణ్. ఆంధ‌్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం. 2014 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చిన పవన్ కల్యాణ్ నాలుగేళ్లు తిరిగే సరికి ఆయనే త‌న‌ పార్టీనే బ‌రిలో పెట్టేశారు. వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతామంటూ ఏకంగా ఓ అభ్యర్ధిని కూడా రంగంలో దింపేశారు. రోజుకో చోట సభలు, సమావేశాలు పెడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులను… ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఏకి పారేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వని భారతీయ జనతా పార్టీని కూడా విమర్శిస్తున్నారు. అయితే ఆ విమర్శలు మాత్రం తమలపాకులతో కొట్టినట్లుగా ఉండడం విశేషం.
ఇదే విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లో ప్రజలకు వివరిస్తున్నా పవన్ మాత్రం తన విమర్శలు మాత్రం మానడం లేదు. పవన్ కల్యాణ్ హోదా ఇవ్వని భారతీయ జనతా పార్టీని, మోడీని హోదా అడ‌గ‌ని జగన్ ను విమర్శించకుండా తనపైపే పడుతున్నారంటూ చంద్రబాబు నాయుడు వాపోతున్నారు. అంతే కాదు పవన్ కల్యాణ్ భారతీయ జనతా పార్టీ ఏజెంట్ అని కూడా ఒకానొక దశలో వ్యాఖ్యానించారు. దీన్ని అనేక సార్లు పవన్ కల్యాణ్ తప్పుపట్టారు. అయితే చంద్ర‌బాబు చెప్పిన మాటే నిజ‌మని తేలింది. తాజాగా పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో మైనారీటీల సమావేశంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
ఇన్నాళ్లు ప‌వ‌న్‌ భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్నారని అనుకుంటున్న వారందరికీ పవన్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి. ఇంతకీ ఆ వ్యాఖ్యలు ఏమిటనుకుంటున్నారా…?” భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ కాదు..అదొక రాజకీయ పార్టీ. గోద్రా అల్లర్ల సమయంలో మోదీని విమర్శించిన చంద్రబాబు ఆ తర్వాత వారితో కలిసారు. జాతీయ స్దాయిలో రెండే పార్టీలు ఉన్నాయి. వాటిలో ఏదో ఒక పార్టీతో ప్రాంతీయ పార్టీలు కలవాల్సిందే. భవిష్యత్తులో జనసేన భారతీయ జనతా పార్టీతో కలసినా తప్పు పట్టకండి. విలీనం చేస్తే తప్పు ప‌ట్టండి ” అని వ్యాఖ‌్యానించారు. సినిమా వాళ్ల రాజకీయాలు తమ స్వప్రయోజనాల కోసమే కాని ప్రజల కోసం కాదని పవన్‌ కల్యాణ్ మరోసారి రుజువు చేసారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

2 Comments

  1. NOW ITIS VERY CLEAR FOR ANDHRA PEOPLOE THAT BJP JANASENA AND YSRCP ARE ONE AND THEY ALL WORK AS PER INSTRUCTIONS OF MODI AND ANDHRAPRADESH ISGOING TO SUFFER MUCH MORE IF ANY VOTES THESE PARTIES.L

  2. బీజేపీని వెనకేసుకొస్తూ బీజేపీతో తన లోపాయికారి బంధాన్ని పరోక్షంగా పవన్ బయట పెట్టుకున్నాడు.జగన్ మగతనాన్ని ప్రశ్నించిన పవన్ రాష్టానికి అన్యాయం చేసిన మోడీని,గవర్నర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ పై కుట్రలు పన్నుతున్న కేసీఆర్ ను ప్రశ్నించి తన మగతనం నిరూపించుకోవాలి.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.