సేనాని రాజ‌కీయం చ‌ర్చ‌ల‌తో స‌రి!

జ‌న‌సేనాని.. వేగం త‌గ్గింది. ఇంత‌వ‌ర‌కూ క‌నిపించి దూకుడు మాయ‌మ‌వుతుంది. ఇదంతా విప‌క్షాల మాట కాదు.. జన‌సైనికుల అంత‌రంగం. రెండుసార్లు కంటి ఆప‌రేష‌న్స్ వ‌ల్ల కాస్త విరామం ఇచ్చార‌ని.. అంతేగానీ.. తామేమి వెన‌క్కిత‌గ్గ‌లేదంటున్నారు జ‌న‌సేన నేత‌లు. ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే.. ఇప్పుడు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. రాజ‌కీయ వ్యూహాల‌కు ప‌ద‌ను పెడుతున్నారు. క‌ల‌సివ‌చ్చే వారితో మంత‌నాలు సాగిస్తున్నారు. తెలంగాణ‌లో తాము ఏ విధంగా న‌డ‌వాలి.. ఎవ‌రికి మ‌ద్ద‌తునివ్వాల‌నే అంశాల‌పై దృష్టిసారించారు. గ‌త  ఎన్నిక‌ల్లో వైసీపీ దాదాపు కేసీఆర్‌కు అనుకూలంగానే వ్య‌వ‌హ‌రించింది. మీడియాతో స‌హా పార్టీ నేత‌లు కూడా ప‌రోక్షంగా ఆ పార్టీకు సాయ‌ప‌డ్డారు.
అయితే ఇదంతా అక్క‌డ నువ్వు ఇక్క‌డ నేను అనుకుంటూ సాగిన రాజ‌కీయ సాయం. కానీ.. ఈ సారి.. ప‌రిస్థితి వేరు. పైగా వైసీపీ కేడర్ లేదు. ఉన్న‌నేతల్లో గ‌ట్టినేత‌లూ లేరు. అటువంటి స‌మ‌యంలో ఆ బాధ్య‌త‌ను ఈ సారి ప‌వ‌న్ తీసుకోబోతున్న‌ట్టుగా ప్ర‌చారం సాగుతుంది. అదీ ప‌రోక్షంగా ఎక్క‌డైతే.. బ‌ల‌మైన అభ్య‌ర్థులున్నారో.. అక్క‌డ ఈ సారి జ‌న‌సేన త‌న గ‌ణాన్ని బ‌రిలోకి దింపనుంద‌నే ఊహాగానాలున్నాయ‌. అయితే.. ఇప్ప‌టికే కేసీఆర్‌పై  ఎర్ర‌పార్టీల‌న్నీ గుర్రుగా ఉన్నాయి. మ‌హాకూట‌మితో జ‌ట్టుక‌ట్టాల‌ని ఉవ్విళూరుతున్నాయి. కాంగ్రెస్‌, టీడీపీ స‌ర‌స‌న నిల‌బ‌డి తాము కూడా ఉనికి చాటుకోవాల‌నే భావ‌న‌కువ‌చ్చాయి. ఇటువంటి ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ చ‌ర్చ‌ల్లో అవ‌న్నీ అంగీక‌రిస్తారా ఎర్ర‌న్న‌లు అనేది సందేహం. ఏమైనా.. పార్టీల‌న్నీ పాద‌యాత్ర‌లు, ఎత్తుగ‌డ‌ల‌తో మునిగితేలుతుంటే.. నువ్వేంద య్యా. నీడ‌ప‌ట్టున కూర్చుని చ‌ర్చ‌లు చేస్తావంటూ కొంద‌రు సీనియ‌ర్లు గుర్రుమంటున్నార‌ట‌. మ‌రి.. సేనాని రంగంలోకి దిగి.. ఆ ముచ్చ‌ట ఎప్పుడు తీర్చుతారో..!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.