అన్ని సీట్లల్లో పోటీ అన్న జనసేన

రానున్న ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండదు. ఏపీలోని అన్ని సీట్లల్లో పోటీ చేస్తామని గతంలోనే ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. టీడీపీతో పొత్తు ఉండదా అంటూ చాలా మంది నెటిజన్లు అడిగారు. ఏమనుకున్నారో ఏమో వెంటనే ఆ ట్వీట్ ను తీసేశారు పవన్ కల్యాణ్. అప్పుడు చంద్రబాబు అంటే పవన్ కల్యాణ్ కు చాలా ఇష్టం. దేశంలోనే ఉత్తమ సిఎం చంద్రబాబు అంటూ కితాబునిచ్చారు. కాలం మారింది. ఇప్పుడు చంద్రబాబు అంటే దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రిగా కనపడుతున్నాడు. తెల్లారి పాటికే ఉత్తమ ముఖ్యమంత్రి కాస్తా.. ఉత్త సిఎంగా మారాడట. అందుకే పవన్ కల్యాణ్ మాటలకు ఒక లెక్క లేదంటున్నారు. తిక్క ఎక్కువని చెబుతున్నారు. నాడు అవునంది. నేడు కాదంటున్నాడు. నేడు కాదంటోంది నాడు అవునంటున్నాడు. లాజిక్ లేకుండా మాట్లాడటం పవన్ కల్యాణ్ కే చెల్లింది. 
2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి సాగేందుకు పవన్ సిద్దమయ్యారనే ప్రచారం సాగుతోంది. కానీ ఆ ఊహాగానాలకు తెరదించుతూ తాను ఒంటరిగానే 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు పవన్. హైదరాబాద్‌లో జరిగిన 13 జిల్లాల ప్రతినిధుల సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్టు చెప్పారు. అనుభవం లేదని ఎవరైనా అంటే దాన్ని తిప్పికొట్టాలన్నారు. పోటీ చేయలేకపోవచ్చు. కానీ రెండు సంస్థాగత ఎన్నికల్లో పనిచేసిన అనుభవం తమ సొంతం. అదే విషయాన్ని జనాలకు చెప్పాలన్నారు పవన్. సగటు మనిషి.. అణగారిన వర్గాల గొంతుకగా జనసేన ఉండాలని కార్యకర్తలకు పవన్ పిలుపునిచ్చారు. ఇటు వైకాపా, అటు టీడీపీలు హోదా కోసం పోరు చేస్తుంటే తాను మాత్రం అమావస్యకో పౌర్ణమికో ఒకసారి ఇలా వచ్చి అలా వెళుతున్నాడు. జనాల్లో తిరగడం జనసేనకు పెద్దగా ఇష్టం లేదేమో అన్నట్లుగా ఉంటోంది అతని తీరు. 
అనంతపురంలో పోటీ చేస్తానంటున్న పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి అన్నది ఇంకా ప్రకటించలేదు. అనంతపురం సిటీనే ఇందుకు వేదిక కావచ్చంటున్నారు. అనంతపురం ఎంపీగా ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారు. రానున్న కాలంలో ఆయన రాజకీయాల నుంచి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో జేసీ కుమారుడు పవన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసే వీలుంది. అందుకే పవన్ కల్యాణ్ ముందస్తుగా అక్కడ రాజకీయ వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. జేసీ పవన్ కు… పవన్ కల్యాణ్ అంటే అభిమానం. తాను ఎంపీగా పోటీ చేసినా తన అనుచరులను పవన్ కల్యాణ్ కు ఓటేసేలా ఒప్పందం చేసుకునేందుకు జనసేన ఆయనతో మంతనాలు ఆడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేతగా ఉన్న జేసీ పవన్.. జనసేన అధినేత పవన్ కు సహకరిస్తారా అనేది అనుమానంగానే ఉంది.  
జనసేన పార్టీ వ్యూహకర్తగా దేవ్‌ని నియమించారు పవన్. పార్టీ కార్యక్రమాల రూపకల్పనలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు దేవ్. మరోవైపు  కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌‌కు సంబంధించిన 1200 మంది కార్యకర్తలు దేవ్ టీమ్‌కు సహకరించనున్నారు. అదే విధంగా ఆగస్టు రెండో వారంలో తెలంగాణలో పోటీపై పవన్ ప్రకటన చేయనుండటం ఆసక్తిని రేపుతోంది. వైకాపా, బీజేపీతో పొత్తు కుదుర్చునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారనే ప్రచారం వచ్చినా కాదంటున్నారు. కామ్రేడ్స్ తోను కలిసి పోయేది లేదని చెప్పారు. కానీ ఎన్నికల సమయం వచ్చేసరిగా పొత్తు ఉంటుందనేది రాజకీయ నిపుణులు చెబుతున్న మాట. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.