జనసేన పదవులన్నీ కాపులకేనా

తనకు కులాలు అంటే ఇష్టం లేదు. తాను కాపునేనని పలుసార్లు చెప్పారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కులగజ్జి ఉన్న నేతలు ఇకనైనా బుద్ది తెచ్చుకోవాలని చెబుతారు. కానీ ఆచరణలో కాపులకే పవన్ అధిత ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపికైంది. మీడియా కో-ఆర్డినేటర్ హరి ప్రసాద్ మొదలుగొని ఇప్పటి వరకు జరిగిన నియామకాలన్నీ కులం పరంగా జరిగినవి అంటున్నారు. అసలు జనసేన సోషల్ మీడియాలో పని చేయాలంటే కాపులకే పెద్ద పీట అంటున్నారు. ఆసంగతి పక్కన పెడితే ఇప్పుడు జరుగుతున్న నియామకాలన్నీ కాపులకే ఉంటున్నాయి. 
జనసేన ఆవిర్భావ సభకు కొద్ది రోజుల ముందు నెల్లూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ మాజీ నేత మాదాసు గంగాధరంను పార్టీలో చేర్చుకున్నారు. ఆయన కాపు నేత. మాదాసుకు కోఆర్డినేటర్ పోస్ట్ ఇచ్చారు. ఇక పోరాటయాత్ర పేరుతో బస్సు యాత్ర ప్రారంభించే ముందు తోట చంద్రశేఖర్ అనే నేతను పార్టీలో చేర్చుకున్నారు. ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చేశారు. తోట కాపునేతనే కావడంతో ఇక కాపులకు పార్టీలో తిరుగులేదంటున్నారు. జగన్ రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద వేసినట్లు పవన్ కాపులను దగ్గరకు తీసి…వారికే పదవులు అప్పగిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. 
జనసేనకు… కోశాధికారిగా మారిశెట్టి రాఘవయ్య ఉన్న సంగతి తెలిసిందే. అధికార ప్రతినిధులుగా టీవీ చర్చల్లో పాల్గొంటున్న అద్దేపల్లి శ్రీధర్, పార్థసారధి, ఇక పవన్ తో పాటు ముందు నుంచి నడుస్తున్న మీడియా కోఆర్డినేటర్ పసుపులేటి హరిప్రసాద్, జనసేన యువజన విభాగం ప్రెసిడెంట్‌  కిరణ్ కాపులే. జనసేన తరపున కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల ఇన్చార్జ్‌గా ముత్తంశెట్టి కృష్ణారావుకు బాధ్యతలప్పగించారు. ఆయన కాపునేతగా ఉన్న వ్యక్తినే. మొత్తంగా జనసేన అంటే కాపు పార్టీగా ముద్రపడుతుందంటున్నారు. ఓట్లు కావాలంటే కులాలు, మతాలు, ప్రాంతాల కతీతంగా వ్యవహరించాలి. కానీ ఆ పని చేయడంలో పవన్ కల్యాణ్ జాగ్రత్త పడక పోతే ఇబ్బంది తప్పదంటున్నరాు.  పార్టీ పదవుల్ని భర్తీ చేస్తూంటే.. ఆ పార్టీ నేతలు సంతోషపడాలి. కానీ ఫ్యాన్స్ చాలా మంది విముఖతతో ఉన్నారు. 
పార్టీ పదవులు పొందిన వారంతా.. ఒకే సామాజికవర్గం కావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సామాజికవర్గం వారే అభిమానులుగా లేరు. అందుకే ఇకనైనా పవన్ మేల్కొనాలని చెబుతున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.