జ‌న‌సేనాని.. వెనుక ర‌హ‌స్య శ‌క్తులెవ‌రు?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. సినీ న‌టుడిగా స్టామినా ఉన్నోడు. చిత్ర‌రంగంలో ఇమేజ్ ఉన్న హీరో. అంత వ‌ర‌కూ అయితే ఒకే. ఆయ‌న మీద ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ఎంద‌రు బుర‌ద‌జ‌ల్లినా స‌రిపోయేది. కానీ.. ఇప్పుడాయ‌న జ‌నసేన అనే ఓ రాజ‌కీయ‌పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు.. అధినేత కూడా. సామాజిక‌వ‌ర్గ‌ప‌రంగా త‌న‌కంటూ గుర్తింపు ఉంది. నెల‌రోజులుగా.. ప‌వ‌న్ ల‌క్ష్యం చేసుకుని మాట‌ల దాడి పెరిగింది. సామాజిక మాధ్య‌మాలు.. ప‌లు ఛాన‌ళ్లు కూడా.. శ్రీరెడ్డి అనే ఓ వ్యాంప్‌తో ఆడిస్తున్న డ్రామాలు ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌డుతున్నాయి. వ‌ర్మ‌.. ఇదంతా నా కుట్రే అన్నంత వ‌ర‌కూ శ్రీరెడ్డి మాట‌ల వెనుక బాధ‌ను.. ఆమె అనుభ‌వించిన వేద‌న తాలూకూ క‌న్నీటిని సానుకూలంగా అర్ధం చేసుకున్నారు. ఆమె అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న చేస్తే.. కామ‌న్‌మ్యాన్ కూడా వేద‌కు గుర‌య్యాడు. అటువంటిది ఇదంతా రాజ‌కీయ కుట్ర‌.. కేవ‌లం ప‌వ‌న్‌ను డ్యామేజ్ చేసేందుకు ఆడిన దొంగాట అని వారే బ‌హిరంగంగా చెప్ప‌టం.. ఒకింత క‌ల‌వ‌రాన్ని.. రేప‌టి రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై ఆందోళ‌న‌ను క‌లిగించింద‌నే చెప్పాలి.
ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌న్న‌త‌ల్లిపై శ్రీరెడ్డి కామెంట్స్‌పై స్వ‌యంగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు జ‌న‌సైనికుల‌ను ర‌గిలిస్తున్నాయి. అమ్మ‌ను తిట్టినపుడు తాను చ‌విచూసిన బాధ‌ను ట్వీట్ చేసిన ప‌వ‌న్‌.. తాను సినీ హీరో.. రాజకీయ నాయ‌కుడు కాక‌ముందే.. ఓ అమ్మ‌కు కొడుకునంటూ ఉద్వేగం వెలిబుచ్చారు. ఒక‌ప్పుడు.. అసెంబ్లీ నిండుస‌భ‌లో నాటి సీఎం వైఎస్‌రాజ‌శేఖ‌ర్‌రెడ్డి.. స్వ‌యంగా చంద్ర‌బాబును ఉద్దేశించి సేమ్‌.. ఇదే త‌ర‌హాగా.. మీ అమ్మ బ‌తికుంటే నీలాంటోడిని ఎందుకు క‌న్నానా అంటూ ఏడ్చేదంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడ‌దే సీన్ ప‌వ‌న్ విష‌యంలో మ‌రొక‌రి నోటి నుంచి రిపీట్ అయింది. అయితే.. ఇదంతా ఎవ‌రు చేస్తున్నారు. రాజ‌కీయంగా ఎదుర్కోలేక‌.. ఇటువంటి చ‌వ‌క‌బారు వ్యూహాలు వేస్తున్నార‌నేది జ‌న‌సేన పార్టీ అనుమానం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ద‌ర్శ‌కుడు వ‌ర్మ‌కు మంచి అనుబంధం ఉంది. పైగా.. జ‌గ‌న్ అంటే చాలా ఇష్ట‌మ‌నేవాడు. అదే స‌మ‌యంలో త‌న‌కు మెగాఫ్యామిలీ అంటే ఇష్టంలేద‌నేది త‌రచూ త‌న మాట‌ల‌తో వెలిబుచ్చేవాడు. పైగా చిరంజీవి, ప‌వ‌న్‌, రామ్‌చ‌ర‌ణ్‌ను విమ‌ర్శిస్తూ చాలా కామెంట్స్ చేశాడు.
2019లో ఏపీలో పాగా వేయాలంటే కాపు ఓట్లు కీల‌కం. జ‌న‌సేన బ‌రిలో ఉంటే.. ఓట్ల చీలిక త‌ప్ప‌దు. ఒక‌వేళ కొన్ని సీట్లు గెలిస్తే.. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌రం. అటువంటి స‌మ‌యంలో కాంగ్రెస్‌, వైసీపీల‌ను ద్వేషించే ప‌వ‌న్ త‌మ‌కు స‌పోర్టు చేయ‌డ‌నే ఆలోచ‌న‌కూడా వైసీపీలో ఉండ ఉండ‌వ‌చ్చు. దీనికి ప్ర‌తిగా.. ఇప్పుడే ప‌వ‌న్‌ను జ‌నంలో ప‌లుచ‌న చేస్తే.. త‌మ‌కు అడ్డంకి ఉండ‌ద‌నే ఎత్తు కూడా శ్రీరెడ్డి ఇష్యూను త‌మ వైపున‌కు మ‌ల‌చుకున్నార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. టీడీపీ.. త‌న అనుకూల మీడియా ద్వారా ఇదంతా చేయిస్తూ.. వైసీపీను దోషిగా ప్ర‌జ‌ల ముందు నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంద‌నేది వైసీపీ ప్ర‌త్యారోప‌ణ‌. కానీ.. మాన‌సికంగా ఇబ్బందికి గురైంది మాత్రం జ‌న‌సేనాని. అంద‌రూ బుద్దిమంతులే అయితే.. అస‌లు సూత్ర‌దారులెవ‌రు. ఈ లెక్క‌ను వెలికితీసే ప‌నిలో జ‌న‌సైనికులు కూపీ లాగుతున్నార‌ట‌. దీనికి అంత‌ర్జాతీయంగా పేరున్న ఓ డిటెక్టివ్ సంస్థ‌ను కూడా రంగంలోకి దింపిన‌ట్లు స‌మాచారం. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.