హోదా కోసం కలిసికట్టుగా కమ్యూనిస్టు, జనసేనలు

కమ్యూనిస్టులతో జట్టు కట్టింది జనసేన. ప్రత్యేకహోదా విషయంలో ఐక్యంగా పోరాటం చేసేందుకు సిద్దమయ్యాయి ఆ పార్టీలు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు బీజేపీ, టీడీపీలు న్యాయం చేస్తాయన్న నమ్మకం తమకు లేదనే అభిప్రాయానికి వచ్చాయి సిపిఎం, సిపిఐ, జనసేన పార్టీలు. మాటలు మార్చే వాళ్లు, ప్రజల కోసం నిలబడలేని వాళ్లు ఏం న్యాయం చేయలేరని వారు అభిప్రాయపడ్డారు. 
సీపీఎం, సీపీఐ నాయకులతో హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో పవన్‌ కల్యాణ్ ప్రత్యేకంగా సమావేశయ్యారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల మధ్య చర్చలు జరిగాయి. హోదా విషయంలో ఏయే పార్టీలు ఎలాంటి మాటాలు మాట్లాడాయో వారు చర్చించారు. వైకాపా హోదాపై పోరాడుతున్నా చిత్తశుద్ధి లేదనే అభిప్రాయానికి వచ్చారు నేతలు. హోదా విషయంలో టీడీపీ అన్నింటికి తలూపి ఇప్పుడు తాము ఏదో చేస్తున్నట్లు చెప్పడం పట్ల కామ్రేడ్స్ కన్నెర్ర జేశారు. కేంద్రం హామీ ఇచ్చి ఆచరణ లేకపోయినా టీడీపీ మద్దతు పలికిందన్నారు. ఫలితంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. నిధుల కొరత ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు పుష్కరాలకు మరొక పనులకు వినియోగించారని చెప్పారు. 
ఉత్తరాంధ్రలో వివిధ రోగాలతో బిడ్డలు చనిపోతున్నా పట్టించుకోకుండా వృధాగా ప్రభుత్వం డబ్బులను ఖర్చు పెడుతుందని ఆరోపించారు పవన్ కల్యాణ్. అవిశ్వాస తీర్మానం పెడితే జాతీయ స్థాయిలో పార్టీలను ఏకం చేస్తానని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆ సంగతి చెప్పడం లేదు. వారు చేయలేదు. వీరు చేయలేదని విమర్శిస్తున్నారు. అసలు మీరు ఏం చేశారంటే మాత్రం సమాధానం లేదు.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.