వాళ్లు జగన్‌నే ఎదురిస్తున్నారట

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. తన పార్టీలోని నేతలకు గౌరవం ఇవ్వడని, తాను చెప్పిందే చేయాలని, ఒక నియంత తరహాలో ఆర్డర్లు ఇస్తుంటాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంతోనే మైసూరారెడ్డి వంటి కొంత మంది నాయకులు ఆ పార్టీని కూడా వీడారు. ఇలా చాలా మందిని కోల్పోయిన తర్వాత జగన్‌లో కొంత మార్పు వచ్చిందని ఆ మధ్య బాగా ప్రచారం జరిగింది. పార్టీలోని సీనియర్లను గౌరవిస్తున్నాడని, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పార్టీలోని కీలక నేతలను సంప్రదిస్తున్నాడని కూడా చెప్పుకున్నారు. ఇదంతా గతం.. ఇప్పుడు వైసీపీ అధినేత పరిస్థితి అత్యంత దయనీయంగా తయారయిందని టాక్ వినిపిస్తోంది. దీంతో ఏపీలో ఇది కాస్తా హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలతో పాటు, స్వతహాగా సెల్ఫ్ గోల్స్‌కు బలైపోతున్న జగన్.. పార్టీలో దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పాదయాత్రతో బిజీ బిజీగా గడుపుతున్న వైసీపీ అధినేత.. ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా పర్యటనను ముగించుకున్నాడు.

గోదావరి జిల్లాలో తమ బలాన్ని పెంచుకోవాలని భావించిన జగన్.. ఆ రెండు జిల్లాలపై ఎక్కువ దృష్టి సారించాడు. అందుకోసమే ఎక్కువ రోజులు పాదయాత్ర చేశాడు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో అయితే, తన రూట్ మ్యాప్‌లో లేని ప్రాంతాల్లో కూడా పర్యటించాడు. అంతేకాదు, ఇక్కడి పర్యటనలోనే జనసేన అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. కాపు రిజర్వేషన్లపై వేరు వేరు ప్రకటనలు చేయడం వంటివి పార్టీకి అనుకూలంగా మారకపోగా, ప్రతికూలంగా మారాయి. దీంతో అక్కడి నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఈ పరిణామాలతో నిరాశ చెందుతున్న జగన్‌కు కొంత మంది కీలక నేతలు షాక్ ఇస్తున్నారట. గతంలో తమ అధినేత మాటకు కట్టుబడి ఉన్న ఆ నేతలు ఇప్పుడు అసలు జగన్‌నే లెక్కచేయడంలేదని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, తమకు కావాల్సిన వారికి టికెట్లు ఇవ్వాలని, అలా చేయని పక్షంలో తాము కూడా పార్టీకి రాజీనామా చేస్తామని బెదిరిస్తున్నారని సమాచారం. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్న జగన్‌కు ప్రస్తుతం పరిస్థితులు అంత మింగుడు పడడంలేదని టాక్ వినిపిస్తోంది. మరి వైసీపీ అధినేత జగన్ వీటిని ఎలా అధిగమిస్తాడో వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.