జగన్.. నీకా విషయం మోదీ చెప్పాడా..?

తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావిడి రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. ఏపీలో ముందస్తు లేకున్నా అక్కడ కూడా పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది. అధికార, ప్రతిపక్షాలు చేస్తున్న పనులకు ఎన్నికలు వచ్చేస్తున్నాయా..? అనే సందేహం కలుగుతోంది. తెలుగుదేశం పార్టీ అభివృద్ధే ఆయుధంగా బరిలోకి దిగాలని భావిస్తుండగా, మిగతా పార్టీలు ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. అందులో ముఖ్యంగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఆ పార్టీ అధినేత చేసే పనులకు పార్టీలోని నేతలు అయోమయానికి గురవుతున్నారు. తాజాగా విశాఖలో జరిగిన పార్టీ సమావేశంలో ఇలాంటి సంఘటనే జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నికలు జనవరిలోగా జరుగుతాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయని.. సర్వసన్నద్ధంగా ఉండాలని వైసీపీ నేతలను ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆదేశించాడు. జనవరిలోగా ఎన్నికలు జరిగితే సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా నేతలంతా బూత్‌ స్థాయిలో ఓటర్లపై పట్టు సంపాదించాలని జగన్‌ నిర్దేశించాడు. ప్రతి నెలా సమన్వయకర్తలు ఏయే బూత్‌లను సందర్శించాలో నిర్ణయించామని.. వాటిలోనే తిరగాలని చెప్పాడు.

అదేవిధంగా ఎన్నికల ముందు ఓటర్ల జాబితాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, గత ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేసిన వారిని జాబితా నుంచి తొలగించినందున వారందరినీ తిరిగి చేర్చే బాధ్యతను సమన్వయకర్తలే తీసుకోవాలన్నాడు. ఇటీవలి కాలంలో సోషల్‌ మీడియాకు ఆదరణ ఉంటున్నందున పార్టీ ప్రచారం కోసం దానిని విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించాడు. ఏదో నిజంగానే జనవరిలోగా ఎన్నికలు వచ్చేసినట్లు జగన్ మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం.. వచ్చే ఏప్రిల్, మే నెలలలో ఎన్నికలు జరుగుతాయి. ఎలా లేదన్నా.. ఏడెనిమిది నెలలు పడుతుంది. జగన్‌మోహన్ రెడ్డికి ఇది తెలియనిదేమీ కాదు. అయినా నాలుగు నుంచి ఐదు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో.. జనవరి నాటికి సర్వం సిద్ధంగా ఉండాలని జగన్‌ పిలుపునిచ్చాడు. ఇప్పుడే కాదు.. గతంలోనూ ఇలాంటి కామెంట్లు చాలానే చేశాడు. అయితే, ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బీజేపీతో సన్నిహితంగా మెలుగుతున్న జగన్.. ఈ వ్యాఖ్యలు చేయడంతో మోదీనే చెప్పాడా..? అని టీడీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.