ఈ విషయంలో మాత్రం జగన్ సక్సెస్ అయ్యాడు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు రోజురోజుకూ మారిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ప్రజలు ఎటువైపు సపోర్టు చేయాలో అర్థంకాని స్థితిలో ఉన్నారు. అయితే, ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో టీడీపీ గ్రాఫ్ క్రమంగా పెరుగుతుండడంతో పాటు, ప్రతిపక్షాలు అంత చురుకుగా లేకపోవడంతో.. అక్కడి ఓటర్లు తెలుగుదేశంవైపే మొగ్గుచూపే అవకాశాలు ఉన్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ కారణంగానే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జనాలను తన వైపునకు తిప్పుకునేందుకు ప్రతిపక్ష నేత జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే, అధికార పార్టీ కూడా వాటిని తిప్పి కొడుతుండడంతో ఆయన డైలమాలో పడిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ఓటర్ల దృష్టిని మరల్చేందుకు జగన్ సిద్ధమయ్యాడని, అందుకే సంచలన ప్రకటనలు చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. జనసే అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, ఇది జరిగి రెండు రోజులు తిరగకుండానే కాపు రిజర్వేషన్లపై తన స్టాండ్ ఏమిటో తేల్చేయడం వంటివి ఇందులో భాగమేననే ప్రచారం జరుగుతోంది.

ఏపీలో సంచలనం రేకెత్తించిన ఈ రెండు విషయాల వల్ల జగన్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయితే, ఒక విషయంలో మాత్రం జగన్ సక్సెస్ అయ్యాడనే టాక్ వినిపిస్తోంది. పవన్‌ కల్యాణ్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన జగన్‌ను ఆయన అభిమానులు ఒక ఆట ఆడుకున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ పలు వివాదాస్పద పోస్టులు పెట్టారు. అంతేకాదు, జగన్ కుటుంబ సభ్యులను కూడా ఇందులోకి లాగేశారు. ఇది పెద్ద వివాదం అవుతుందని గ్రహించిన పవన్, తన అభిమానులకు సందేశం కూడా పంపాడు. ఇందులోకి జగన్ కుటుంబ సభ్యులను తీసుకురావద్దని వారిని కోరాడు. అయినా, వారి విమర్శలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి కానీ, తగ్గలేదు. ఇలాంటి సందర్భంలోనే జగన్, కాపు రిజర్వేషన్ల గురించి సంచలన ప్రకటన చేయడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. ఇక, ఇప్పుడందరూ పవన్ గొడవను మర్చిపోయి, కాపు రిజర్వేషన్ల గురించే మాట్లాడుతున్నారు. ఇలా చేయడం వెనుక కూడా జగన్ ప్లాన్ ఉందట. పవన్ వివాదం నుంచి బయటపడేందుకే జగన్ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చాడని తెలుస్తోంది. కాకపోతే దాని వల్ల ఎంత నష్టం ఉంటుందో అతడు గ్రహించలేకపోయాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.