ఎన్టీఆర్ పేరు పెడతానని బాబును ఇరుకున పెట్టిన జగన్

చంద్రబాబు చేయలేని పని జగన్ చేస్తానంటున్నారు. కృష్ణా జిల్లాకు అన్న ఎన్టీఆర్ పేరు పెడతానన్నారు. సిఎం చంద్రబాబు ఏనాడు ఆ ఆలోచన చేయలేదు. కానీ విపక్షంలో ఉంటూ ఎన్టీఆర్ గౌరవాన్ని పెంచే పని చేస్తానని జగన్ చెప్పడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపికైంది. ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. నాలుగేళ్ల పాటు ఎన్డీఏతో భాగం పంచుకున్న చంద్రబాబు మహానాడు సందర్భంగా ఎన్టీఆర్ పేరు ప్రస్తావించడం తప్ప ఏం చేయలేదు. కేంద్రం ఒత్తిడి చేయలేదు. ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు వస్తే అధికారికంగా ఆ అవార్డు ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి అందుకోవాల్సి ఉంటోంది. అది చంద్రబాబుకు ఇష్టం లేదంటారు. అందుకే భారతరత్న అవార్డు రాకుండా చంద్రబాబు తన వంతుగా పావులు కదిపారనేది వచ్చే విమర్శ. అసలు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. తన అల్లుడు వెన్నుపోటు పొడిచారని ఎన్టీఆర్ నే స్వయంగా చెప్పారు. 
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తన చివరి రోజుల్లో టీడీపీ నుంచి చీలి ఎన్టీఆర్ టీడీపీని పెట్టుకున్న సంగతి తెలిసిందే. అంతగా ఆయన ఆత్మ క్షోభించేలా చంద్రబాబు వ్యవహరించారనే వాదనుంది. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు జగన్ చేసిన కామెంట్ ఇరు పార్టీల్లోను చర్చనీయాంశమైంది. తాము అధికారంలోకి వస్తే అన్న ఎన్టీఆర్ ను గౌరవిస్తామని జగన్ చెప్పిన తీరు ఆశ్చర్యమే. ఇది ఒక రకంగా చంద్రబాబును ఇరుకున పెట్టే అంశమే. 
నిమ్మకూరులో జగన్ కు ఘన స్వాగతం
ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరును జగన్ సందర్శించారు. తాను అధికారంలోకి వ‌స్తే కృష్ణా జిల్లాకు నందముూరి తారక రామారావు పేరు పెడతానని జగన్ చెప్పారు. నిమ్మకూరులో నీరు-చెట్టు కార్యక్రమంలో జరుగుతున్న దోపిడీని, అవినీతిని ప్రజలు జగన్ దృష్టికి తెసుకొచ్చారు. నందమూరి కుటుంబ సభ్యులే.. నీరు-చెట్టు అక్రమాలను జగన్‌కు వివరించడం చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ పేరుతోనే ప్రచారానికి వెళుతోంది టీడీపీ. అలాంటి ఎన్టీఆర్ పేరును కృష్ణా జిల్లాకు పెట్టవద్దనే చెప్పే సాహసం చేయలేదు చంద్రబాబు సర్కారు. అదే సమయంలో ఎన్టీఆర్ పేరును పెట్టాల్సిన పరిస్థితిని తీసుకువచ్చారు జగన్. ఎన్టీఆర్ మా వాడు అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు జగన్ ఇచ్చిన పంచ్ కు ఇబ్బంది పడక తప్పడం లేదు. 
అక్రమాలపై ఫిర్యాదు…
ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్ 1900కిలోమీటర్ల మైలురాయిని దాటారు. ఎన్టీఆర్ పుట్టిన ఊరైన నిమ్మకూరులో జగన్ కు ప్రజల ఘన స్వాగతం పలకడం విశేషం. అందుకే వారి కోసం జగన్ వినూత్న ప్రకటన చేసి ఆకట్టుకునే పని చేసాడు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కృష్ణా జిల్లాకు నందమూరి తారక రామారావు జిల్లాగా పేరు మారుస్తామన్నారు. రూ.8.5లక్షల ఖర్చుతో చెరువును తవ్వుతూ.. అలా తవ్వగా వచ్చిన మట్టిని ట్రాక్టర్ ఒక్కొక్కటి రూ.350 చొప్పున.. లారీ రూ.600 చొప్పున అమ్ముతున్నారని నందమూరి కుటుంబ సభ్యులు చెప్పారు. తద్వారా వచ్చిన డబ్బును టీడీపీ నేతలు తలా కొంత తీసుకుంటున్నారని ప్రస్తావించారు. జగన్ తాజాగా చేసిన ప్రకటన టీడీపీలో కలకలం రేపుతోంది. అసలు ఎన్టీఆర్ గురించి ఇలా జగన్ హామీనిస్తాడు అనుకోలేదు టీడీపీ నేతలు. అందుకే అసలు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు తదితరులు అంటున్నారు. 
అంతే తప్ప కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే మంచిదే అనే మాట అనడం లేదు. ఒకవేళ అలా పెట్టవద్దని చెబితే ఎన్డీఆర్ అభిమానులే చంద్రబాబుకు ఎదురు తిరిగే వీలుంది. మొత్తంగా ఎన్టీఆర్ పేరుతో చంద్రబాబును ఇరకాటంలో పెట్టారు జగన్.  

1 Comment

  1. Now there is no opposition to name the district after N.T.R. CBN saved the party when one greedy ‘Surpanakha’ tried to destroy NTR’s honor and reputation and destroy TDP permanently. Instead of blaming CBN, now let ‘them’ try and get Bharat ratna to NTR,as CBN is in no position to influence BJP. No body bothers who receives it, as that person is only a vehicle.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.