బీజేపీతో కలిసి జగన్ భారీ స్కెచ్!

సీఎం చంద్రబాబు ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికి వైసీపీ అధినేత జగన్ భారీ స్కెచ్ వేశారని టీడీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు గురించి తప్పుడుగా ప్రచారం చేయడానికి జగన్ ఎంచుకున్న వ్యక్తుల్లో ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లాం, నటుడు పోసాని కృష్ణమురళి, జనచైతన్య వేదిక లక్ష్మణరెడ్డి… ఇలా లిస్ట్‌లో చాలా మందే ఉన్నారు. అయితే ఇప్పడు కొత్తగా మోత్కుపల్లి నరసింహులును కూడా ఆ లిస్ట్‌లో చేరారట. తెలంగాణ టీడీపీల ఫైర్ బ్రాండ్ నేతగా ఉన్న మోత్కుపల్లి తనకు గవర్నర్ పదవి దక్కకపోవడంతో రివర్స్ గేర్ తీసుకుని చంద్రబాబుపైనే మాటలదాడికి దిగారు. దీంతో ఎలాగైనా చంద్రబాబును 2019 ఎన్నికల్లో ఓడించేందుకు భారీ కసరత్తు చేస్తున్న జగన్.. ఇప్పుడు రంగంలోకి మోత్కుపల్లిని దింపేందుకు ప్రయత్నిస్తున్నారట. అందులో భాగంగానే మోత్కుపల్లితో వైసీపీ ఎంపీ విజయ్‌సాయిరెడ్డి మంతనాలు జరిపారని టీడీపీ ఆరోపిస్తోంది. తెలంగాణ నేతగా మోత్కుపల్లి వైసీపీలో చేరలేదు. కానీ ఆ పార్టీ స్పాన్సర్‌షిప్‌తో చంద్రబాబును విమర్శించడానికి రెడీ చేయిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

 

ఇటీవల మోత్కుపల్లి నర్సింహులును కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కలిశారు. మోత్కుపల్లికి ముద్రగడ సంఘీభావం తెలిపారు. తాజా రాజకీయాలపై మోత్కుపల్లితో ముద్రగడ మంతనాలు జరిపారు. ఆంధ్రాలో తమ జాతిని అణగదొక్కడమే ధ్యేయంగా చంద్రబాబు పెట్టుకున్నారని, మనందరం ఏకమై ఆయనకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని, ఈ నేపథ్యంలోనే ఏపీకి వచ్చి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని మోత్కుపల్లిని ముద్రగడ కోరారు. అంతేకాకుండా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మోత్కుపల్లి ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ మీడియాను చూసి వాహనం దిగకుండానే విజయసాయిరెడ్డి వెళ్లిపోయారు. టీడీపీ నుంచి మోత్కుపల్లిని బహిష్కరించిన తర్వాత వారం తిరక్కుండానే ముద్రగడ, విజయ్‌సాయిలు కలవడం వెనుక భారీ వ్యూహం దాగి ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. జగన్ అధికారంలోకి వస్తే తాను ఆశించిన గవర్నర్ పదవి వస్తుందని మత్కుపల్లి కూడా భావిస్తున్నారట. అందుకే చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏపీలో ప్రచారం చేసేందుకు వస్తానని మాట ఇచ్చారట.

 

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు లాంటి రాజకీయ చాణుక్యుడిని ఢీకొట్టడానికి తన ఇమేజ్ మైనస్‌గా మారడం జగన్‌ను కలవరపెడుతోంది. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన దుస్థితి, వెంటాడుతున్న ఈడీ కేసులు జగన్‌ను అభత్రాభావానికి గురిచేస్తున్నాయి. చంద్రబాబు పనిమంతుడనే ఇమేజ్‌ ప్రజల్లో బలంగా ఉంది. దాన్ని వీలైనంతగా తగ్గిస్తేనే తనకు ప్లస్ అవుతుందని, ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలు జగన్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత పెంచుకున్న వారందరినీ కూడగట్టి ‌రాజకీయ విమర్శలకు సిద్ధం చేస్తున్నారన్న అనుమానాలు టీడీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. జగన్‌కు బీజేపీ అండ కూడా ఉండడంతో రాష్ట్రంలో కులాల కుంపట్లు రాజేసి అశాంతికి బీజం పడేటట్లు చేయడమే వైసీపీ ధ్యేయంగా కనిపిస్తోందని అంటున్నారు. జగన్‌ను తమ గుప్పిట్లో పెట్టుకుని ఏపీలో పాగా వేయాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా టీడీపీకి వ్యతిరేకంగా పన్నే కుట్రలకు కేంద్ర స్థాయిలో సహకరిస్తున్నారని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేకపోలేదు. జగన్ కేసుల విచారణలో నత్తనడకన దర్యాప్తు సాగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించడం చూస్తుంటే ఈ కుట్రలు నిజమనే అనిపించకమానదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.