జ‌నం స‌రే.. ఓట్లు రాల‌తాయంటారా!

ఇసుకేస్తే.. రాల‌నంత జ‌నం.. రాజ‌మండ్రి బ్యారేజ్ పై చీమ‌ల‌దండుగా.. క‌ద‌లిన అభిమానం.. వామ్మో.. వాయ్యో.. ఇంకేమైనా ఉందా.. ఇక‌.. జ‌గ‌న్ సీఎం కావ‌టం ఖాయం.. ఎవ‌రెన్ని అడ్డంకులు పెట్టినా.. మ‌న‌కిక తిరుగులేదు.  వైసీపీ నేత‌ల్లో ఆనంద‌మే ఆనందం.. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో గోదారోళ్లు కొట్టిన దెబ్బ‌కు దిమ్మ‌తిరిగింది. పైగా.. ప‌శ్చిమ‌గోదావ‌రి ఓట‌ర్లు..క‌నీసం ప‌రువు కాపాడేందుకు వైసీపీకు ఒక్క‌సీటు కూడా గెలిపించ‌లేదు. ఇప్పుడు అదేచోట బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుంటే.. వైసీపీ శ్రేణుల‌కు ఏమీ అర్ధం కావ‌ట్లేద‌ట‌.

 

నిజ‌మే.. జ‌గ‌న్ సీమ నుంచి ప్రారంభించిన  ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు అన్నిచోట్లా స్పంద‌న బాగానే ఉంది. జ‌నం కూడా బాగానే త‌ర‌లివ‌స్తున్నారు. ఇదంతా… అధికార పార్టీపై పెల్లుబుకిన వ్య‌తిరేక‌త‌గానే వైసీపీ భావిస్తుంది. రాష్ట్రంలో పెరిగిన అవినీతి.. ప్ర‌త్యేక హోదాపై చంద్ర‌బాబు ఫెయిల్యూర్ వ‌ల్ల‌నే జ‌నం త‌మ‌కు ఆద‌ర‌ణ చాటుతున్నార‌నేది జ‌గ‌న్ వ‌ర్గం లెక్క‌. అదే నిజ‌మైతే.. గ‌తంలోనూ.. వైసీపీ నేత ఓదార్పుయాత్ర‌కు జ‌నం వ‌చ్చారు. అందాకా ఎందుకు.. మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీతో 2009లో జ‌నంలోకి వెళితే.. సీట్ల‌న్నీ త‌న‌వే అన్నంత‌గా జ‌నం చేరారు. ఇప్పుడు.. ప‌వ‌న్ వెంట కూడా.. యువ‌త ఉత్సాహంగా వెళుతుంది. అందాకా.. ఎందుకు.. చంద్ర‌బాబు పాద‌యాత్ర‌చేసినా జ‌నం బాగానే వ‌స్తారు. ఏ ప‌ద‌వి లేని.. జేడీ ల‌క్ష్మినారాయ‌ణ ఊళ్ల‌లోకి వెళుతున్నా జ‌నం పోగ‌వుతున్నారు. మ‌రి.. ఇదంతా.. ఓటుగా మారుతుందా అనే వ‌ద్ద‌నే నేత‌ల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంది. ఇప్పుడ‌దే భ‌యం.. వైసీపీను కూడా వేధిస్తోంద‌ట‌. పైగా.. వైసీపీ యాత్ర‌కు జ‌న‌స‌మీక‌ర‌ణ‌కు.. లోక‌ల్ నేత‌లు.. ఎమ్మెల్యే, ఎంపీ సీటు ఆశిస్తున్న‌నేత‌లంగా భారీగా సొమ్ములు కుమ్మ‌రిస్తున్న‌ట్లు కూడా ఆరోప‌ణ‌లున్నాయి. గంట న‌డిస్తే.. రెండొంద‌లు.. రెండు పూట్ల భోజ‌నం కూడా రెడీ అంటున్నార‌నే గుస‌గుస‌లు న్నాయి. అయితే.. ఇటువంటి జ‌న‌స‌మీక‌ర‌ణ‌కు.. దాదాపు అన్ని రాజ‌కీయ‌పార్టీలు చేసేవి ఇదే..

కానీ.. ఓటు బ్యాంకుగా మ‌ల‌చుకునే వారిదే అధికారం. మ‌రి.. ఆ టెక్నిక్‌.. ఏ పార్టీ వైపు ఎక్కువ‌గా ఉంద‌నేదాన్ని బ‌ట్టే.. ప‌వ‌ర్ అందినా.. ప్ర‌తిప‌క్షంలోకిచేరినా అనేది వేరే చెప్పాల్సిన ప‌నిలేదేమో!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.