వైసీపీ నేతల రియాక్షన్ చూసి జగన్ షాక్

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల కోసం అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలు రచించుకుంటున్నాయి. ఏపీలో ఎన్ని పార్టీలు ఉన్నా ప్రధాన పోటీ మాత్రం టీడీపీ-వైసీపీ మధ్యే ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్యలో వచ్చిన జనసేన కొంత ప్రభావం చూపే అవకాశం ఉన్నా.. ఇంకా ఆ పార్టీ సంస్థాగత నిర్మాణ దశలోనే ఉండడంతో అక్కడ ఎన్నికల హడావిడి కనిపించడంలేదు. విభజన తెచ్చిన కష్టంతో బీజేపీ, కాంగ్రెస్ తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలోనే ఉండడం వల్ల వాటి ప్రభావం ఏపీలో కనిపించకపోవచ్చు. ఇక రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీల విషయానికొస్తే.. టీడీపీ-వైసీపీ ఎన్నికల కోసం ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలకు గాలం వేయడం.. సొంత పార్టీల్లోని గెలుపు గుర్రాలను వెతికే పనిలో నిమగ్నమై ఉన్నాయి. టీడీపీలో ఎన్నికల్లో పోటీకి నిలబెట్టే అభ్యర్ధుల విషయంలో స్పష్టత వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీలో మాత్రం అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఇంకా కసరత్తు జరుగుతూనే ఉందని, ఇప్పుడిదే జగన్‌కు తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే జగన్‌కు ఈ సారి అభ్యర్ధుల ఎంపిక కత్తి మీద సాములా తయారయిందట.

జగన్ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించినప్పుడు, చాలా మంది ఈ యాత్రలోనే అభ్యర్ధులను ప్రకటిస్తాడని భావించారు. కానీ, జగన్ మాత్రం అలా చేయలేదు. దీనికి కారణం అభ్యర్ధుల విషయంలో ఇంకా కసరత్తు జరుగుతూనే ఉందట. అంతేకాదు, అభ్యర్ధులను ప్రకటిస్తే టికెట్ రాని వాళ్లు వేరే పార్టీకి జంప్ అయ్యే ఛాన్స్ ఉండడం వల్ల కూడా జగన్.. అభ్యర్ధుల ప్రకటనను వాయిదా వేశాడని సమాచారం. వైసీపీలో పార్లమెంట్‌ కంటే అసెంబ్లీకి పోటీ చేయడానికే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారట. అసెంబ్లీతో పోలిస్తే లోక్‌సభ అభ్యర్ధికి అయ్యే ఖర్చు ఎక్కువ కావడమే దీనికి కారణంగా తెలుస్తోంది. అసలు కొన్ని నియోజకవర్గాల్లోనైతే వైసీపీ తరపున పార్లమెంట్‌కు పోటీ చేయడానికి అభ్యర్ధులే దొరకడంలేదనే టాక్ కూడా వినిపిస్తోంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి వస్తుందని ఆశించి కూడా కొందరు ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి అఇష్టత చూపుతున్నారని సమాచారం. అంతేకాదు, గత ఎన్నికలను గుణపాఠంగా నేర్చుకున్న కొందరు కీలక వైసీపీ నేతలు పోటీకి ససేమిరా అనడంతో ఆ పార్టీ అధినేత జగన్ సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది. ఇన్ని ఆటంకాలు తట్టుకుని జగన్ ఎలా ముందడుగు వేస్తాడో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.