త్రిశంకు స్వ‌ర్గంలో.. జ‌గ‌న్‌!

ప్ర‌త్యేక హోదా విష‌యంలో జ‌నం.. చంద్ర‌బాబు మాట‌ల‌కే ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. జ‌న‌సేన బ‌ల‌ప‌డుతుంద‌నే వాద‌న పెరుగుతోంది. బీజేపీపై త‌మ‌కు న‌మ్మ‌కం ఉందంటూ.. వైసీపీ నెంబ‌రు2 విజ‌య‌సాయిరెడ్డి చెప్ప‌క‌నే చెప్పారు. ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లో వున్న జ‌గ‌న్‌కు.. కోస్తా ప్రాంతంలో ఊహించినంత ప్ర‌జాధ‌ర‌ణ ల‌భించ‌ట్లేద‌ట‌. వెర‌సి.. జ‌గ‌న‌న్న ప‌రిస్థితి త్రిశంకు స్వ‌ర్గంలో ఉందంటూ ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఈడీ ఎటాచ్ చేసిన కోట్లాదిరూపాయ‌ల్లో తిరిగి జ‌గ‌న్ ఖాతాలో రూ.300 కోట్లుకు పైగా జ‌మ అయిన‌ట్లు వార్త‌లు.. జ‌గ‌న్ శిబిరాన్ని మ‌రింత ఇరుకున పెట్టేశాయి. ఫ‌లితంగా.. ఇప్పుడు జ‌గ‌న్‌కు ఇర‌కాట ప‌రిస్థితి ఎదురైన‌ట్లుంది. హోదా విష‌యంలో విభేధించి.. టీడీపీ దూర‌మైతే.. ఆ స్థానాన్ని వైసీపీ భ‌ర్తి చేయ‌వ‌చ్చ‌ని భావించింది. త‌ద్వారా.. గ‌త ఎన్నిక‌ల్లో చేసిన త‌ప్పిదాన్ని స‌రిదిద్దుకోవాల‌ని భావించింది. అందుకే.. క‌ర్ర విర‌గ‌కుండా పాము చావ‌కుండా కేంద్రంతో వ్య‌వ‌హ‌రిస్తూ.. తెలివైన రాజ‌కీయం అంటూ చంక‌లు గుద్దుకున్నారు. కానీ.. తామొక‌టి త‌ల‌స్తే.. విధి ఒక‌టి త‌ల‌చిన‌ట్లుగా  ప్ర‌ధాన‌మంత్రి మోదీ వ్య‌వ‌హారశైలి.. తెలుగు రాష్ట్రాల‌పై అనుస‌రిస్తున్న వైఖ‌రి తెలుగునాట వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టింది. బీజేపీ నేత‌లు.. లెక్క‌లు చూపి బ‌య‌ట‌ప‌డాల‌ని చూసినా.. జ‌నం న‌మ్మేప‌రిస్థితుల్లో లేరు. ఈ నేప‌థ్యంలోనే.. బ‌హిరంగ స‌భా వేదిక‌పై.. ప్ర‌ధాని మోదీ.. త‌న‌కు రాజ‌కీయ గురువుగా భావించే అధ్వాణీ విష‌యంలో వ్య‌వ‌హ‌రించిన తీరు.. న‌మ‌స్కారం చేసినా ప‌ట్టించుకోని వైనంపై.. సామాన్యులు మండిప‌డ్డారు. మ‌రో సారి అవ‌కాశం ఇస్తే.. బీజేపీ నాయ‌క‌త్వం.. ఇంకెత‌గా బ‌రితెగిస్తుంద‌నే ఆలోచ‌న కూడా ప్ర‌జ‌ల్లో మొద‌లైంది. ఎటుచూసినా ప్ర‌తికూల వాతావ‌ర‌ణ‌మే ఉన్న స‌మ‌యంలో.. ఉచ్చుముడిలా భ‌య‌పెడుతున్న కేసులతో బీజేపీను విమ‌ర్శించే ప‌రిస్థితిలో వైసీపీ లేదు. ఒక‌వేళ విమ‌ర్శించ‌కుండా మౌనంగా వున్నా.. ప్ర‌జ‌ల్లోకి ప్ర‌తికూల సంకేతాలు వెళ‌తాయి. ఒక‌వేళ‌.. పోన్లే అని పోరు చేప‌డితే.. కేసుల ద‌ర్యాప్తు వేగ‌వంతం అవుతుంది. ఊహించి షాక్ నుంచి జ‌గ‌న్ ఎలా తేరుకుంటారో.. రాబోయే ఎన్నిక‌లకు వ్యూహం ఏ విధంగా అమ‌లు చేస్తారో.. వేచిచూడాలి.

1 Comment

  1. Y.S.R.C.p has zero chances of coming to power in 2019. In the present fluid political situation which changed dramatically B.J.P, will have to think twice before helping corrupt political dinosaurs.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.