జగన్ యాత్రకు విరామం అందుకేనట..

ఏపీలో 176 రోజులుగా ప్రజాయాత్ర చేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళుతున్నా…పాదయాత్ర ఆపడం లేదు. అదే సమయంలో అధికార పార్టీ నేతలు వైకాపాలో చేరుతున్నారు. ఇది ఆ పార్టీ శ్రేణులను ఉత్సాహంలో నింపుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ బంద్ చేసినప్పుడు…క్రిస్మస్ కు, వైకాపా సలహాదారు చనిపోయినప్పుడు ఆయన యాత్రకు విరామం ఇచ్చారు. అంతకు మినహా యాత్ర ఆపలేదు. కానీ ఇప్పుడు ఆరోగ్యం బాగోలేక పోవడంతో యాత్రను ఆపాల్సి వచ్చింది. వేసవి చివరి దశకు వచ్చింది. ఇలాంటి సమయంలో ఎండ తీవ్రత తట్టుకోలేక పోతున్నారు జగన్. అందుకే రోగాల బారిన పడుతున్నారు. వాతావరణం మారుతోంది. నీళ్లు, ఆహారం మారుతోంది. అదే సమయంలో ప్రజల కోసం ఎండలోను యాత్ర చేస్తున్నాడు జగన్. ఫలితంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. 
పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ జగన్ కు జ్వరం, తలనొప్పితో బాధపడుతున్నారు. ఫలితంగా పాదయాత్రకు విరామం ప్రకటించారు. వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకున్నా కీలక నేతలతో అక్కడ మంతనాలు జరుపుతుండటం ఆసక్తికరం. మహానాడు వేదికగా సిఎం చంద్రబాబు తన పై చేసిన కామెంట్లకు ధీటుగా సమాధానమిచ్చాడు జగన్. అసలు ఏపీకి హోదా విషయంలో చంద్రబాబు చేతిగానితనం వల్లనే రాలేదని ఎద్దేవా చేశారు. వాస్తవంగా చంద్రబాబు హోదా విషయం మాటలు మార్చడాన్ని జనాలు తప్పుపడుతున్నారు. ఇప్పుడు తానే పెద్ద పోరాటం చేస్తున్నట్లు ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించడం హాట్ టాపికైంది. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఈవీఎంలను తమకు అనుకూలంగా మార్చుకునే వీలుందని చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేయడం విశేషం. 
గురువారం విశ్రాంతి, శుక్రవారం కోర్టు ఉంటోంది. ఫలితంగా రెండు రోజులు సెలవులు వచ్చినట్లు అయింది. ఫలితంగా జగన్ తిరిగి కోలుకుంటారంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.