జగన్ అలా చేసుంటే చంద్రబాబు ఇరుకున పడేవారట

రాజకీయంలో ఒక పార్టీ మైనస్‌ను మరో పార్టీ ప్లస్‌గా మలుచుకుంటుంది. అలా చేస్తేనే వాళ్లకు మనుగడ ఉంటుంది. లేకపోతే సర్ధుకుని పోవడమే అవుతుంది. ఇలా చాలా సార్లు జరిగింది కూడా. ఏపీ రాజకీయాల్లో చూస్తే.. అధికార పార్టీ టీడీపీ ఒక్కటే ఒకవైపు.. మిగిలిన పార్టీలన్నీ ఒకవైపు ఉన్నాయి. ఎక్కడైనా ప్రతిపక్షం బలంగా ఉంటేనే అధికార పక్షం మంచి పాలన చేస్తోంది. కానీ, ఏపీలో మాత్రం ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ బలంగా ఉన్నట్లు కనిపించదు. ఏపీలో జరిగిన చాలా పరిణామాలను వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు. కానీ అలా చేయలేదు. తాజాగా జరిగిన ఓ విషయంలో కూడా వైసీపీ పూర్తిగా విఫలమైంది. లేకపోతే చంద్రబాబు ఇరుకునే పడేవారే.

ఇప్పుడు ఏపీలో ఏదైనా ముఖ్యమైన అంశం ఉందంటే అది ప్రత్యేక హోదానే. దీని పేరే చెప్పుకుని కొందరు హీరోలైతే.. మరికొందరు జీరోలయ్యారు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ కూడా ఎన్డీయే నుంచి బయటికి వచ్చి, బీజేపీ చేసిన మోసాన్ని ప్రజలకు చెప్పడంలో సక్సెస్ అయింది. అధికార పక్షంలో ఉన్న టీడీపీ ఇంత చేస్తే.. ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఇంకెంత చేయాలి..? అంటే చేసింది. తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించి కొత్త వ్యూహానికి నాంది పలికారు. అయితే ఇందులో పూర్తిగా విఫలమైంది వైసీపీ. రాజీనామా చేయించినా వాటిని ఆమెదించకుండా అడ్డుపడి, ఉప ఎన్నికలు తప్పించుకున్నారు. కానీ, జగన్ మరోలా చేసుంటే చంద్రబాబు ఇబ్బంది పడేవారే.

వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయించిన జగన్ వాటిని వెంటనే ఆమోందించుకుని, ఉప ఎన్నికలకు వెళ్లుండాలి. అలా వెళ్లినప్పుడు టీడీపీ ఎలాగూ పోటీ పెడుతుంది. ఆ సందర్భంలో హోదా కోసం రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలకు పోటీ పెట్టారనే అపవాదును చంద్రబాబుపై నెట్టేసే ఛాన్స్ ఉండేది. అంతేకాదు ఒకవేళ పోటీ పెట్టినా ఎన్నికలు జరిగుంటే.. వచ్చే ఫలితాలను వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకోవచ్చు. కానీ ఈ విషయంలో జగన్ ఎందుకో వెనకడుగు వేశాడు. జగన్ రాజీనామా చేయించినా ఏపీ ప్రజల దృష్టిలో అది కుట్రలో భాగమేననే సంకేతాలివ్వడంలో మాత్రం ఏపీ సర్కార్ విజయం సాధించిదనే చెప్పాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.