జగన్ పరువు తీసిన మేకపాటి

వైసీపీ ప్రకటించిన నవరత్నాల పథకాల్లో ఒకటి వికలాంగులకు ఫించన్ స్కీం. తాము అధికారంలోకి వస్తే వికలాంగులకు నెలకు రూ.2 వేల పించన్ ఇస్తామని చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్. కానీ మేకపాటికి అది గుర్తు లేదు. అందుకే తాము అధికారంలోకి వస్తే నెలకు రూ. 3 వేలు ఇస్తామని చెప్పేశారు. ఆ తర్వాత కాదు కాదు.. రూ.2 వేలే అని మిగతా వారు ప్రస్తావించారు. ఫలితంగా మేకపాటికి ఏం అర్థం కాలేదు. కొంత మంది మూడు వేలని.. మరికొంతమంది రెండు వేలని అరిచారు. కొంత మంది వాదులటకు దిగారు. ఫలితంగా ఇక ఈ వాదులాట ఎందుకని మేకపాటి తన స్పీచ్ ను ఆపేశారు. ఫలితంగా వైకాపా పరువు పోయింది. జగన్ ఎంతో ఇష్టంగా గుంటూరు సభలో ప్రస్తావించిన అంశాన్ని గుర్తు పెట్టుకోలేక మేకపాటి అటు ఇటుగా చెప్పేశారు. ఫలితంగా మీడియాకు మేత అయింది. అందులోను ఈనాడు లాంటి సంస్థలు ఆ సంగతి హైలెట్ చేశాయి. మంత్రి నారా లోకేష్ వర్థంతి, జయంతికి తేడా తెలియకుండా మాట్లాడినప్పుడు ఈనాడు పెద్దగా పట్టించుకోలేదు. విపక్షానికి చెందిన నేత మాట్లాడిన మాటలను మరింతగా ప్రచారం కల్పించింది. ఫలితంగా ఈనాడు పత్రికకు ఉన్న గుడ్ విల్ దెబ్బతింటుందనే ప్రచారం సాగుతోంది.    
రైతులకు ‘వైఎస్‌ఆర్‌ భరోసా’, డ్వాక్రా మహిళలకు ‘వైఎస్‌ఆర్‌ ఆసరా’, వృద్ధులకు రూ. 2వేల పెన్షన్‌, కొత్తగా 25 లక్షల ఇళ్ల నిర్మాణం, చదువుల కోసం అమ్మ ఒడి పథకం, ఆరోగ్యశ్రీకి అవసరమైన నిధుల కేటాయింపు, సాగునీరు కోసం జలయజ్ఞం, మద్యనిషేధం వంటి నవరత్నాలను ప్రకటించింది వైసీపీ. వైకాపాలో కీలక నేత. ఆయనకే తన పార్టీ పథకాలు ఏంటో తెలియక పోవడం విడ్డూరమే. ఇకనైనా ఇలాంటి తప్పులు రాకుండా ఉంటే మంచిది. లేకపోతే పార్టీ పరువు బజారున పడటం ఖాయం. అందరి ముందు మాట్లాడేటప్పుడు సమాచారం ఉండాలి. లేకపోతే ఇలానే ఇబ్బంది ఉంటోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.