జ‌గ‌న్ భ‌య్యా .. గండంగ‌డిచేదెలా!

జ‌గ‌న్ యాత్ర‌లో గ‌త ద‌ర్పం క‌నిపించ‌ట్లేదు. పైగా తెలియ‌ని అభ‌ద్ర‌త మ‌ధ్య‌.. జ‌నం భారీగా వ‌స్తున్నా.. విజ‌యం ద‌గ్గ‌ర‌వుతుంద‌ని వైసీపీ శ్రేణులు ఆనంద‌ప‌డుతున్నా.. దాన్ని జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మాత్రం ఆస్వాదించ‌లేక‌పోతున్నార‌ట‌. ఎందుకీ.. భ‌యం.. ఎవ‌రు చెప్పారు. ఏం జ‌ర‌గ‌బోతుంది. మ‌రోసారి జ‌గ‌న్‌కు జైలుగండం ఉందా! లేక‌పోతే.. పాత త‌ప్పిదాల‌న్నీ మ‌రోసారి కాళ్ల‌కు చుట్టుకుంటాయా.. బాబు, ప‌వ‌న్ క‌ల‌సి మ‌రోసారి వైసీపీను చిత్తు చేసేందుకు ఎత్తులు వేస్తున్నారా! వీటిలో ఏమైనా కావ‌చ్చు.. లేదా.. కొత్త రాజ‌కీయ వ్యూహంలో జ‌గ‌న్ పావుగా మార‌వ‌చ్చు. దీనికి వైసీపీలోని ముదురు నేత‌లే ఎస‌రు పెట్ట‌వ‌చ్చు. అబ్బే అలాంటిదేమీలేదండీ.. కేవ‌లం ఇది ప‌చ్చ‌చొక్కాల ప్ర‌చారమే అనుకుంటూ వైసీపీ నేత‌లు కొట్టిపారేస్తున్నా జ‌గ‌న్‌లో మాత్రం.. దాని తాలూక ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ మాత్రం.. ప‌ట్టుకుని వ‌ద‌ల‌ట్లేద‌ట‌.

 

అస‌లెందుకీ స‌మ‌స్య అంటే.. బీజేపీ ఏపీలో మిత్రుడుగా భావిస్తున్న టీడీపీ ఝ‌ల‌క్ ఇచ్చింది. అధ్య‌క్షుడిగా చేసిన క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ పూర్తిగా టీడీపీ బ‌ద్ద‌శ‌త్రువు. జ‌న‌సేన బ‌లం తెలియ‌కుండా పొత్తుపెట్టుకుంటే నిండా మున‌గొచ్చు. అందుకే.. తెర‌వెనుక వైసీపీతో స‌యోధ్య కుదుర్చుకునేందుకు సీబీఐ కేసుల‌ను బూచిగా బీజేపీ చూపుతుందంటూ ఇప్ప‌టికే ప్రచారం జోరుగా సాగుతుంది. టీడీపీ కూడా ఇదే అస్త్రం ప్ర‌యోగించి బీజేపీను దెబ్బ‌తీయాల‌ని యోచిస్తుంది. మ‌రి.. బీజేపీ ఊరుకుంటుందా.. అబ్బే అలాంటిది ఏమీలేదంటూ.. జ‌గ‌న్ మెడ‌కు ఉచ్చు బిగించే మార్గాల‌ను అన్వేషించే ప‌నిలో ఉంద‌ట‌. దీంతో.. జ‌గ‌న్ వంటి వారినే జైలుకు పంపామంటూ.. రేప‌టి ప్ర‌చారానికి అనువుగా మ‌ల‌చుకోవాల‌ని భావిస్తుంది. ఒక‌వేళ‌.. వైసీపీ వైపు సానుభూతి పెరిగితే.. దానికీ ఓ రూటుందంట‌.. సైలెంట్‌గా మీ ప‌ని మీరు చూసుకోండి.. రేపు ప్ర‌భుత్వం రాగానే.. జ‌గ‌న్‌ను జైలు నుంచి బ‌య‌ట‌కు ర‌ప్పించి.. సీఎం చేద్దామ‌నే ప్ర‌పోజ‌ల్ కూడా బీజేపీ ఉంచిద‌నే ప్ర‌చార‌మూ సాగుతుంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. న‌రేంద్ర‌మోడీ హ‌యాంలోనే 2019 క‌మ‌లం ఎర్ర‌కోట‌పై జెండా ఎగురేయాలా.. రాష్ట్రం ప్ర‌భుత్వం ఏ పార్టీ వున్నా.. అది ఎన్‌డీఏకు అనుకూల‌మై ఉండాలి.. ఏపీ, తెలంగాణ‌లోనే కాదు.. యావ‌త్ భార‌త‌దేశంలో రాష్ట్రాన్ని ఎవ‌రు ఏలుకున్నా ప‌ర్లేదు.. మాకు కావాల్సింది.. ఎంపీల‌నేది బీజేపీ లెక్క‌.. ఇదే లాజిక్‌ను కాంగ్రెస్ కూడా క‌ర్ణాట‌కలో జేడీఎస్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌టం ద్వారా చెప్పేసింది. లాజిక్ బాగానే వున్నా.. జ‌గ‌న్ గుండెల్లో మాత్రం గుబులు మొద‌లైంద‌ట‌. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.