ఐవైఆర్‌కు షాక్ ఇచ్చిన జగన్

రెండేళ్ళపాటు ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా ఎక్కడా ఒక్క వివాదంలో కూడా తలదూర్చకుండా తన విధులు నిర్వహించిన ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు. రిటైర్ అయిన తర్వాత ఆయనిచ్చిన సలహాతోనే బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, దానికి ఆయననే చైర్మన్‌ను చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. తర్వాత ఆ పదవిలో కొనసాగుతూనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన పోస్టుల కారణంగా ఆ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన వెనుక వైసీపీ హస్తం ఉందనే టాక్ బాగా వినిపించింది. దీనికి ఆద్యం పోసినట్లు ఇప్పుడు ఓ వార్త ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఐవైఆర్ కృష్ణారావు, ప్రతిపక్ష నేత జగన్ మధ్య చీకటి ఒప్పందం ఒకటి జరిగిందట. దాని కారణంగానే ఆయన ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారట. తాజాగా ప్రతిపక్ష నేతను కలిసిన ఐవైఆర్‌కు ఆయన షాక్ ఇచ్చాడట. ఇప్పుడు ఈ వార్త బాగా హల్‌చల్ చేస్తోంది. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌ ఉన్న సమయంలో వైసీపీ అధినేత ఐవైఆర్‌తో భేటీ అయ్యారట. అప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేసి, చంద్రబాబు ఇమేజ్‌ను డామేజ్ చేస్తే మీకు ఎంపీ సీటు గానీ, ఎమ్మెల్యే సీటు గానీ ఇస్తానని జగన్ ఆఫరిచ్చాడట. దీనికి ఒప్పుకున్న ఐవైఆర్‌.. అప్పటి నుంచి ఏపీ ప్రభుత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరించాడట. దీంతో ఆయనపై వేటు పడిన విషయం తెలిసిందే.

కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌ వచ్చిన జగన్‌ను ఐవైఆర్‌ మరోసారి కలిసి.. తనకు కేటాయించే స్థానం ఏదో చెబితే.. ఇప్పటి నుంచే అక్కడ తిరుగుతానని, తద్వార ఆ నియోజకవర్గంలో పట్టు పెరుగుతుందని అడిగారట. దీనికి జగన్.. ‘‘ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు కదా.. అది బాగుంది.. ముందు దీనిని కంటిన్యూ చేయండి.. సీటు గురించి తర్వాత ఆలోచిద్దాం’’ అన్నాడట. దీంతో షాక్ అయిన ఐవైఆర్‌.. తాను అడిగిన వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి, తనకే చైర్మన్ పదవి ఇచ్చిన చంద్రబాబుకు ద్రోహం చేయడం వల్లే ఇలా జరిగిందని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వచ్చేశాడట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.